ఆ బుల్లితెర కార్యక్రమానికి లాభాలే లేవా.. తప్పనిసరి పరిస్థితులలో ప్రసారం చేస్తున్నారా?

బుల్లితెర చానల్స్ లో ఈటీవీ ఛానల్ కు ఓ ప్రత్యేకత ఉంది.గత రెండు దశాబ్దాల నుంచి ఈ ఛానల్ ఎంతో అద్భుతమైన రేటింగ్ కైవసం చేసుకొని ముందుకు దూసుకెళ్తోంది.

 Etv Channel Getting No Profits From Sai Kumar Wow Show Details, Broadcast Mandat-TeluguStop.com

అయితే ఒకానొక సమయంలో ఈ ఛానల్ రేటింగ్ పూర్తిగా పడిపోవడంతో నిర్వాహకులు జబర్దస్త్ కార్యక్రమం వంటి కామెడీ కార్యక్రమాల ద్వారా తిరిగి ఈ ఛానల్ ను అధిక రేటింగ్ తో ముందుకు నడిపిస్తున్నారు.ఇలా ఈ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డాన్స్ షో వంటి కార్యక్రమాలతో టాప్ రేటింగ్ కైవసం చేసుకుంది.

ఇలా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను ప్రసారం చేయడంతో ఈటీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ కూడా చూడటానికి చాలా మంది ఇష్టపడటం లేదు.ఇక కొన్ని సంవత్సరాలుగా ఈటీవీ ఛానల్ ను కొనసాగిస్తున్నప్పటికీ ఈ ఛానల్ లో ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాల ద్వారా భారీగానే లాభం పొందుతున్నట్టు తెలుస్తుంది.

అయితే ఈ టీవీలో ప్రసారమయ్యే ఒక కార్యక్రమం వల్ల ఈ ఛానల్ కు రూపాయి కూడా లాభం లేదని పూర్తిగా నష్టాలతో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ విధంగా ఈటీవీలో నష్టాలతో ప్రసారం చేసే కార్యక్రమం ఏది అనే విషయానికి వస్తే సాయికుమార్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి వావ్ కార్యక్రమం.

Telugu Programs, Etv Channel, Jabardasth, Sridevidrama-Movie

అసలు ఈ కార్యక్రమం ఒకటి ప్రసారమవుతుందని కూడా చాలామంది ప్రేక్షకులకు తెలియదు.ఇలా నష్టాలతో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ ఉన్నారు.అయితే ఇలా నష్టాలతో ప్రసారం చేయడానికి కారణం కేవలం సాయికుమార్ తో ఈటీవీ వాళ్లకు ఉన్న అనుబంధమేనని అంతకుమించి ఈ కార్యక్రమం ద్వారా వారికి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదని తెలుస్తోంది.ఇలా ఏమాత్రం ప్రయోజనం లేనటువంటి కార్యక్రమాలను ప్రసారం చేసే బదులు మంచి ఎంటర్టైనింగ్ కార్యక్రమాలను ప్రసారం చేయడం ద్వారా ఛానల్ రేటింగ్ మరింత పెరుగుతుందనే ఆలోచనలు నిర్వాహకులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube