పిల్లల్ని ఎత్తుకుపోతుందనుకుని ట్రాన్స్‌జెండర్‌పై మూకదాడి.. పోలీసుల విచారణలో..

ఎదుటి వారి పట్ల ఒక్కోసారి మనం చేసే పొరపాట్లు సరిదిద్దుకోలేనివిగా ఉంటాయి.కొంత మంది ఎవరైనా ఏదైనా చెబితే ఏ మాత్రం ఆలోచించకుండా ముందుకు వెళ్తుంటారు.

 Gang Attack On Transgender For Picking Up Children , Transgender , Saira Mogra J-TeluguStop.com

ఎవరో ఏదో తప్పు చేశారంటే ఏ మాత్రం స్పృహ లేకుండా ఆ వ్యక్తులను మనం కొడుతుంటాం.తీరా అంతా జరిగిపోయాక ఆ వ్యక్తులు అమాయకులు అని తేలుతుంది.

అప్పుడు కొట్టిన వారంతా తమను తాము సమర్ధించుకుంటారు కానీ, జరిగిన తప్పును బయటకు చెప్పుకోరు.బహిరంగంగా ఒప్పుకోరు.

కానీ ఏ తప్పు చేయకుండానే దెబ్బలు తిన్న వారి పరిస్థితి ఆలోచిస్తే నిజంగా చాలా బాధాకరం.సమాజంలో వారు ఏదో తప్పు చేశారనే భావం ఉంటుంది.

తాజాగా ఇదే తరహాలో కొందరు పొరబడి ఓ ట్రాన్స్‌జెండర్‌పై దాడి చేశారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

సైరా మోగ్రా జాన్‌ అనే ట్రాన్స్‌జెండర్‌‌ది మహారాష్ట్రలోని మల్కాపూర్‌ ప్రాంతం.ఆమె బుధవారం ఎప్పటిలాగానే బయటకు వచ్చింది.జాల్‌గావ్‌-జమోద్‌ బస్‌ స్టేషన్‌కు వచ్చి అక్కడ నిల్చుంది.భిక్షాటన కోసం వెళ్లాలని భావించి, తన స్నేహితురాలితో కలిసి అక్కడ వేచి చూస్తోంది.

ఈ లోపు అక్కడికి ఓ ఆటోడ్రైవర్ వచ్చాడు.అతడు అకస్మాత్తుగా వారిని చూసి ఎవరికో ఫోన్ చేశాడు.

ఇంతలో బిలబిలమంటూ అక్కడికి కొంత మంది గుంపు వచ్చేసింది.వారంతా ఆ ట్రాన్స్‌జెండర్‌ను చితక్కొట్టారు.

వారి దెబ్బలకు తాళలేక ఆ ట్రాన్స్ జెండర్ గగ్గోలు పెట్టింది.అసలు ఎందుకు కొట్టారంటే ఆ ట్రాన్స్‌‌జెండర్‌ పిల్లలను ఎత్తుకుపోయే వ్యక్తి అని వారంతా భావించారు.

దీంతో తమ ప్రతాపం మొత్తం ఏ మాత్రం ఆలోచించకుండా ఆ ట్రాన్స్‌జెండర్ పై చూపించారు.పిల్లలను ఎత్తుకుపోయే కిడ్నాపర్ అని భావించి దారుణంగా కొట్టారు.

పోలీసులు వచ్చిన ఆ ట్రాన్స్‌జెెండర్‌ను కాపాడారు.పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా అసలు విషయం తెలిసింది.

ట్రాన్స్ జెండర్ అమాయకురాలు అని తేలింది.దీంతో తనను కొట్టిన 8 మందిపై పోలీసులకు ఆ ట్రాన్స్ జెండర్ ఫిర్యాదు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube