ఇద్దరు భర్తలతో పిల్లలను కన్న.. సెలబ్రిటీలు వీళ్లే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎన్నో అసాధారణమైన విషయాలకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి.ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఇండస్ట్రీ లో జరిగే వింతలు విచిత్రాలు ప్రేక్షకులను సైతం అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి.

 Tollywood Celebrities With More Than One Husband Radhika Srija Soundarya Details-TeluguStop.com

మరిముఖ్యంగా ఇక సినీ సెలబ్రిటీల జీవనశైలి బంధాలు కలుపుకోవడం ఉన్న బంధాలను తెంచుకోవడం ఇవన్నీ చూసి ప్రేక్షకులు షాక్ అవుతారు అని చెప్పాలి.ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవడం తర్వాత మనస్పర్ధలు వస్తే చివరికి విడాకులు తీసుకోవడం కామన్గా జరుగుతూ వస్తోంది.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న నటీమణులు లేదా వారి ఫ్యామిలీకి సంబంధించిన వారు ఏకంగా ఇద్దరు భర్తతో పిల్లలు కన్నవారు ఉన్నారు ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

శ్రీజ :

చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.అప్పట్లో ఈమె పెళ్లి ఎంతో సంచలనంగా మారిపోయింది.

శిరీష్ భరద్వాజ్ తో ఒక కుమార్తెకు జన్మనిచ్చింది.బిడ్డ పుట్టిన వెంటనే భర్తకు విడాకులు ఇచ్చింది శ్రీజ.

తర్వాత కళ్యాణ్ దేవ్ ని రెండో వివాహం చేసుకుంది.వీరి దాంపత్య బంధానికి గుర్తుగా మరో కుమార్తె పుట్టింది.

ఇలా ఇద్దరు భర్తలతో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.

Telugu Chiranjeevi, Radhikasharath, Sharath Kumar, Srija, Tollywood, Husbands-Mo

రాధిక శరత్ కుమార్ :

ఇక ఈ సీనియర్ హీరోయిన్ పెళ్లిళ్ల తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది అని చెప్పాలి.ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని సంచలనమే సృష్టించింది.ఈ క్రమంలోనే మూడు పెళ్లిళ్లలో రెండవ భర్త ద్వారా ఒక కుమార్తెకు జన్మనిచ్చింది రాధిక.

ఆ తర్వాత శరత్ కుమార్ తో ప్రేమలో పడి మళ్ళీ పెళ్లి చేసుకుని ఒక కొడుకుకి జన్మనిచ్చింది.ఇలా ఇద్దరు భర్తలతో పిల్లలకు జన్మనిచ్చింది.

Telugu Chiranjeevi, Radhikasharath, Sharath Kumar, Srija, Tollywood, Husbands-Mo

సౌందర్య రజినీకాంత్ :

రజనీకాంత్ కు ఇద్దరు కుమార్తెలు.అయితే ఇద్దరు కుమార్తెలు కూడా వారి భర్తతో విడాకులు తీసుకున్నారు.పెద్ద కుమార్తె సౌందర్య మొదటి భర్తతో కొడుకు పుట్టిన తర్వాత చివరకు విడాకులు తీసుకొని వేరు పడింది.ఇక ఆ తర్వాత ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోతో ప్రేమలోపడి పెళ్ళి చేసుకొంది.

ఇక ఈ జంటకు ఇటీవల ఒక కుమారుడు కూడా పుట్టాడు.ఇలా ఇద్దరు భర్తలతో ఒక్కో కొడుక్కి జన్మనిచ్చింది సౌందర్య.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube