నివేదా థామస్ మరియు రెజీనా కీలక పాత్రలో నటించిన శాకిని డాకిని ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇద్దరు హీరోయిన్స్ కూడా మీడియా ముందుకు వచ్చి వాళ్ళ ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు పలు మీడియా సమావేశాల్లో పాల్గొన్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కోసం గత వారం రోజులుగా కంటిన్యూ గా ఇద్దరు బిజీ బిజీగానే ఉన్నారు.ఇంత కష్టపడుతున్న ఈ సినిమా కు ఇప్పటి వరకు మినిమం బజ్ రాలేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.
సినిమా విడుదలకు మరికొన్ని గంటలు ఉన్నా కూడా ఈ సినిమా ను గురించి పెద్దగా పట్టించుకుంటున్న వారే లేరు అంటూ ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి.
అడ్వాన్స్ బుకింగ్ చాలా దారుణంగా ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కాస్త ముందుగా ప్రారంభించి సినిమా ను జనాల్లో యాక్టివ్ గా ఉంచాల్సింది అని.ఇప్పుడు హడావుడిగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తే ఫలితం ఏంటి అంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా ప్రారంభం అయ్యి చాలా కాలం అయింది.సురేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న కారణంగా కాస్త ఇండస్ట్రీలో ఆసక్తి అయితే ఉంది, కానీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించేట్లు ప్రమోషన్ కార్యక్రమాలు జరగలేదు అనేది చాలా మంది అభిప్రాయం.

ఈ ఇద్దరు హీరోయిన్స్ కూడా పెద్దగా క్రేజ్ లేని హీరోయిన్స్.కనుక ప్రేక్షకులు ఎంత వరకు సినిమాలు చూసేందుకు థియేటర్లకు వస్తారు అనేది అనుమానంగా ఉంది.ఈ సినిమా ఒక్కటే కాకుండా రేపు మరో రెండు సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి.వాటికి కాస్త కమర్షియల్ టచ్ ఉండడంతో ప్రేక్షకులు అటు వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ బాక్సాఫీస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అదే కనుక నిజమైతే ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్స్ పడ్డ కష్టమంతా బూడిదల పోసిన పన్నీరు అవుతుందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.