దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.ఈ ఏడాది వృద్ధి రేటును ఫిచ్ 7.8 శాతం నుంచి 7 శాతానికి తగ్గించడం మార్కెట్లపై ప్రభావాన్ని చూపినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 412 పాయింట్లు కోల్పోయి 59,934కి పడిపోయింది.
నిఫ్టీ 110 పాయింట్లు నష్టపోయి 17,892 వద్ద నిలిచింది.బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా మారుతి -3.23%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ -2.24%, ఎన్టీపీసీ -1.98%, హెచ్డీఎఫ్సీ -0.28%, భారతి ఎయిర్ టెల్ -0.17% గా ఉన్నాయి.







