గత కొంతకాలంగా అదే పనిగా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ, అధ్యక్షురాలు షర్మిల ఈ మధ్యకాలంలో మరింత దూకుడు పెంచారు.వరుస వరుసగా ప్రజా క్షేత్రంలో పర్యటన చేస్తూ అనేక అంశాలపై ఆందోళన కార్యక్రమాలు, నిరసన దీక్షలు చేపడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ముందుకు వెళుతున్నారు.
అలాగే తనను విమర్శిస్తున్న మంత్రులపైన ఘాటుగానే విమర్శలు బాణాలు వదులుతున్నారు.తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని టార్గెట్ చేసుకుంటూ షర్మిల ముందుకు వెళుతున్న తీరును మొదట్లో పట్టించుకోనట్టుగా టిఆర్ఎస్ నేతలు వ్యవహరించినా, అదే పనిగా విమర్శలు చేస్తూ ఉండడంతో ఆమె విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డిని ఉద్దేశించి షర్మిల సంచలన విమర్శలు చేశారు.ఎవడ్రా నీకు మరదలు…? నువ్వు గజ్జి కుక్కతో సమానం అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను టిఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది.ఈ మేరకు ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.అంతేకాదు షర్మిలపై బిజెపికి మంత్రి నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారం తర్వాత మరింతగా షర్మిల తన విమర్శలకు పదును పెట్టారు.పాలమూరు నీళ్ళ దీక్షలో ఆమె ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేదని, పాలమూరు నీళ్ల పోరుకు శ్రీకారం చుట్టారు.దీనిలో భాగంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 24 గంటల నిరసన దీక్షకు దిగారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మంత్రి నిరంజన్ రెడ్డికి సవాల్ విసిరారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిత ప్రారంభించిన ఈ మేజర్ ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని షర్మిల మండిపడ్డారు.కమిషన్ల ను దోచుకున్నారు కానీ , ప్రాజెక్టు మాత్రం పూర్తి చేయడం లేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు భూనిర్వాసితులకు న్యాయం చేసే వరకు పాలమూరు దీక్ష కొనసాగుతుందని ఆమె వ్యాఖ్యానించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి వ్యవహారాలను ప్రజల తరఫున ప్రశ్నిస్తే అది మీకు తిట్టునట్టు అయ్యిందా అంటూ షర్మిల మండిపడ్డారు.అలా అనిపిస్తే బూతు పురాణంలో ఆరి చేరిన కేసీఆర్ పై, మంత్రి నిరంజన్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.
ఆ తర్వాతనే రాజన్న బిడ్డను ముట్టుకోవాలని అలాగే మంత్రి నిరంజన్ రెడ్డి పాలమూరు బిడ్డే అయితే ఈ జిల్లా ప్రజల మీద ప్రేమ ఉంటే తాను చేసిన సవాల్ స్వీకరించాలని షర్మిల వ్యాఖ్యానించారు.







