సోషల్ మీడియా పరిధి పెరుగుతున్నవేళ చాలా గమ్మత్తైన వీడియోలు దర్శనమిస్తున్నాయి.గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ముఖ్యంగా పశువులను Lumpy skin disease పట్టి పీడిస్తున్న కధనాలని మీరు చదివే వుంటారు.
ఈ వ్యాధి కారణంగా వేల సంఖ్యలో ఆవులు మృత్యువాత పడుతున్నాయి.రాజస్థాన్‌లో కూడా ఈ వ్యాధి ప్రభావం చాలా తీవ్ర స్థాయిలో వుంది.
ఈ నేపథ్యంలో ఓ ఆవుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.విషయం ఏమంటే, ఓ ఆవు ప్రతి రోజూ మెడికల్ షాప్‌ను విజిట్ చేయడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
విషయం తెలుసుకుని మెడికల్ షాపు యజమానిని అభినందిస్తూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు.సాధారణంగా మనకు ఒంట్లో బాగోలేకపోతే.
ముందుగా గుర్తొచ్చేది మెడికల్ షాప్.అక్కడికి వెళ్లి మనకి అవసరమైన మాత్రలు అడిగి తీసుకుంటాం.
అయితే సరిగ్గా ఓ మనిషిలాగే ఓ ఆవు కూడా ఇదే పని చేస్తోంది.Lumpy skin disease బారిన పడిన ఆ ఆవు.గత నెల రోజులుగా క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం మెడికల్ షాపు వద్దకు వెళ్తోంది.అక్కడ షాపు యజమాని ఇచ్చిన మాత్రలను తీసుకుంటోంది.
ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.
ఈ క్రమంలో మెడికల్ షాపు యజమాని తాజాగా స్పందించడం విశేషమనే చెప్పుకోవాలి.
నెల రోజుల క్రితం షాపు దగ్గరోలో ఉన్న ఆవు.ఈ వ్యాధి బారినపడిందని గుర్తించి.నొప్పి, దురద తగ్గించే మాత్రలను ఓ జాంగ్రీ(స్వీట్)లో పెట్టి దానికి అందించాడట.ఈ క్రమంలో మాత్రల ప్రభావం వల్ల నొప్పి, దురద నుంచి ఆ ఆవు ఉపశమనం పొందిదని చెప్పాడు.
దాంతో ఆ ఆవు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం మెడికల్ షాపు వద్దకు వచ్చి.మాత్రలు తీసుకుంటుందని వివరించాడు.అంతేకాకుండా ప్రస్తుతం ఆ ఆవు ఆరోగ్యం కుదిటపడినట్టు కూడా చెప్పాడు.ఇక అతగాడు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.







