బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ షో ఎంతలా ప్రేక్షకులకు కనెక్ట్ అయిందో చూసాం.
ఇక ఇప్పటికే ఐదు ఎపిసోడ్లు పూర్తి కాగా ఇప్పుడు ఆరో సీజన్ ప్రసారమవుతుంది.అయితే ఈ షోను చాలా వరకు సెలబ్రెటీల వ్యక్తిగతంలో ఎలా ఉంటారు.
వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు.అందరితో ఎలా ఉంటారు అని చూడటానికి ఇష్టపడుతుంటారు.
ఇక మొదట రెండు ఎపిసోడ్ లో స్ట్రాంగ్ సెలబ్రెటీలను తీసుకొని రాగా ఆ తర్వాత సోషల్ మీడియా సెలబ్రెటీలను, యాంకర్లను పరిచయం చేశారు.అలా ఇప్పటివరకు ప్రతి సీజన్ కు అందర్నీ తీసుకొచ్చి వారిని ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాడు బిగ్ బాస్.
అయితే ఈ షోను మరింత ఆసక్తిగా చూపించడానికి మధ్యలో లవ్ ట్రాకులు, రొమాన్స్ లు, గొడవలు ఇలా ప్రతి కంటెస్టెంట్ల మధ్య క్రియేట్ చేసేవాడు బిగ్ బాస్.
ముఖ్యంగా లవ్ ట్రాక్ ల వాటికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు.
దీంతో రేటింగ్ కోసం బిగ్ బాస్ కూడా కొన్ని దిగజారే పనులు కంటెస్టెంట్లతో చేయించేవారు.అలా ఇప్పటికీ ముగిసిన ఐదు సీజన్లలో లవ్ ట్రాకులు బాగానే నడిచాయి.
అంతేకాకుండా రొమాన్స్లు కూడా బాగానే నడిచాయి.

గత సీజన్లలో జరిగిన కొన్ని లవ్ ట్రాకులు బయట ఎంత నెగిటివిటీ ని మూటగట్టుకుందో చూసాం.అయితే లవ్ ట్రాకులలో మితిమీరి ఉండటంతో ప్రేక్షకులు కూడా చూడటానికి బాగా చిరాకు పడ్డారు.లవ్ అంటే ఇద్దరు మనసుల మధ్య ప్రేమ ఉండాలి కానీ.
రెండు శరీరాల మధ్య ఉండకూడదు అని అర్థం.
కానీ బిగ్ బాస్ లో లవ్ అంటే అలా కాదు.
చాలావరకు గమనించినట్లయితే కోరికల వరకు మాత్రమే కనిపించాయి.ఎందుకంటే ఒకవేళ అందులో నిజమైన ప్రేమ కలిగితే బయటికి వచ్చాక కూడా ఆ ప్రేమను అలాగే ఉంచాలి.
కానీ ఇప్పటివరకు బిగ్ బాస్ లో లవ్ ట్రాక్ నడిపిన జంటలు బయటికి వచ్చాక ఎవరి దారి వారు అన్నట్లుగా కనిపించారు.

అంటే షోలో ఉన్నంతవరకు మాత్రమే రేటింగ్ కోసమే ఇలా హద్దులు దాటి ప్రవర్తించినట్లు తెలిసింది.అయితే ఈ సీజన్లో లవ్ ట్రాక్లు అనేవి లేవని చెప్పవచ్చు.ఎందుకంటే ఈ సీజన్ ప్రారంభంలో సిపిఐ నారాయణ ఈ షో గురించి చేసిన కామెంట్లు ఎంతలా హాట్ టాపిక్ గా మారాయో చూసాం.
అయితే ఆయన చేసిన కామెంట్లను దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ ఈసారి ఎటువంటి లవ్ ట్రాకులను నడిపించలేదని తెలుస్తుంది.
దీంతో ఈ సీజన్లో లవ్ ట్రాక్ లు లేకపోవడంతో ఇక ఎటువంటి రొమాంటిక్ సీన్లు కనిపించవు అని అర్థమవుతుంది.
నిజానికి ఈ షో ఇలా ఉంటేనే బాగుంటుంది అని కొందరు అంటున్నారు.మరికొందరు లవ్ ట్రక్ ఉంటే మరింత బాగుండేది అని అంటున్నారు.
మరి భవిష్యత్తులో ఈ సీజన్ లో ఉన్న ఎవరైనా జంటలు ప్రేమలో పడతారో లేదో చూడాలి.