ప్రపంచ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఓ వినూత్న ప్రయోగానికి తెరలేపింది.మహిళలకు సాధికారత కల్పించాలనే సదుద్దేశంతో అమెజాన్ ఇండియా నేడు భారతదేశంలో అతి పెద్ద మహిళా డెలివరీ స్టేషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో డెలివరీ సర్వీస్ పార్టనర్ ద్వారా దీనిని నిర్వహించనున్నారు.కొత్తగా ప్రారంభించిన ఈ డెలివరీ కేంద్రం రాష్ట్రంలో రెండవది కావడం విశేషమనే చెప్పుకోవాలి.
పండుగ సీజన్‌కు సిద్ధంగా ఉన్న అమెజాన్, ఈ ప్రాంతం నుంచి సుమారుగా 50 మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలను ఇక్కడ నుండి అందించనుంది.
మోరంపూడి, తిలక్ రోడ్డు, లాలాచెరువు, ప్రకాశ్ నగర్, దానవాయిపేట అలాగే ఇతర ప్రాంతాలలోని వినియోగదారులకు అమెజాన్ ప్యాకేజీలను అందించేందుకు ఈ కేంద్రం సహాయపడనుండి.
APలో మొట్టమొదటి మహిళా డెలివరీ స్టేషన్‌ను గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో 2021 నవంబర్‌లో ప్రారంభించిన సంగతి అందరికీ విదితమే.ఇక రెండవ సారి ఏర్పాటు చేసిన ఈ స్టేషన్లో స్టేషన్ మేనేజర్లు, ప్రాసెస్ అసోసియేట్‌లు మరియు డెలివరీ అసోసియేట్‌ల వరకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

ఈ క్రమంలో వినియోగదారులకు డెలివరీ వాగ్దానాలను సజావుగా నెరవేర్చేందుకు వారు కమ్యూనిటీకి సంబంధించిన వారి స్థానిక పరిజ్ఞానాన్ని, అమెజాన్ ఇండియా అందించే సాంకేతిక మద్దతును సరిగ్గా వినియోగించుకోవాలని సూచించారు.ఇక్కడ DSP (డెలివరీ సర్వీస్ పార్టనర్) ప్రోగ్రామ్ అనే దానిని నిర్వహించనున్నారు.అమెజాన్ వినియోగదారులకు ప్యాకేజీలను అందించేందుకు దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాల్లోని చిన్న మరియు మధ్య తరహా బిజినెస్‌లతో అమెజాన్ ఇండియా భాగస్వామిగా ఉన్న లాస్ట్-మైల్ డెలివరీ మోడల్.







