విడుదలకు ముందు కంటే ఇప్పుడే ఎక్కువ చేస్తున్న శర్వానంద్‌

యంగ్ హీరో శర్వానంద్ దాదాపు 5 సంవత్సరాల తర్వాత సక్సెస్ ని దక్కించుకున్నాడు.ఈయన మహానుభావుడు సినిమా తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా బొక్క బోర్లా పడ్డాయి.

 Sharvanand Doing Promotions For Oke Oka Jeevitham Now , Sharvanand, Promotions,-TeluguStop.com

మళ్లీ ఇన్నాళ్లకు ఒకే ఒక జీవితం సినిమాతో సక్సెస్ ని దక్కించుకున్నాడు.శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన ఒకే ఒక జీవితం సినిమా విడుదలకు ముందు పెద్దగా అంచనాలు కలిగి లేదు.

ఇది ఒక ఆర్ట్ సినిమా అన్నట్లుగా ప్రేక్షకులు భావించారు.పోస్టర్ లు మరియు ప్రమోషన్ వీడియో లు కూడా అదే తరహాలో ఉండడంతో ప్రేక్షకులు అసలు ఈ సినిమా గురించి చర్చించుకోవడం కనిపించలేదు.

కానీ సినిమా విడుదల తర్వాత ఎక్కువ మంది చర్చించుకోవడం మొదలు పెట్టారు.అందుకే చిత్రాన్ని యూనిట్‌ సభ్యులు కూడా విడుదల కంటే ముందు ఎక్కువగా ప్రమోషన్‌ కార్యక్రమాలు చేయకుండా ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారు.

శర్వానంద్‌ వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు ప్రముఖ యాంకర్ సుమతో కూడా ఇంటర్వ్యూ నిర్వహించారు.అలాగే అమల అక్కినేని మీడియా ముందుకు వచ్చి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలను చేస్తున్నారు.

శర్వానంద్ వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో మీడియాలో సినిమా గురించి మరింతగా టాక్ నడుస్తుంది.కనుక సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా పలు ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిందని, ఈ వీకెండ్ వరకు సినిమా పూర్తిగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది అనే నమ్మకంతో శర్వానంద్ ఉన్నాడు.ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా నటించగా.

కీలక పాత్రలో వెన్నెల కిషోర్ మరియు ప్రియదర్శి నటించారు.ఈ సినిమా ఒక టైం ట్రావెల్ కథ ఆధారంగా రూపొందించింది అనే విషయం తెలిసిందే.

ఈ మధ్య కాలంలో వచ్చిన టైం ట్రావెల్ కథలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి.అదే దారిలో ఈ సినిమా హిట్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube