పన్నులు ఎగ్గొట్టకుండా ఉండేందుకే మోటార్ వెహికల్ పన్నుల చట్ట సవరణ బిల్లు - మంత్రి పువ్వాడ

పన్నులు ఎగ్గొట్టకుండా ఉండేందుకే మోటార్ వెహికల్ పన్నుల చట్ట సవరణ బిల్లు.అసెంబ్లీలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

 Minister Puvvada Ajay Kumar Comments On Motor Vehicle Act In Assembly, Minister-TeluguStop.com

లారీల అంతర్రాష్ట్ర పన్నుల సమస్య త్వరలోనే పరిష్కారిస్తాం.అనివార్యంగా గ్రీన్ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం విధించింది.

రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొట్టకుండా ఉండేందుకే మోటార్ వెహికల్‌ పన్నుల సవరణ బిల్లు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.మోటార్ వెహికల్‌ పన్నుల చట్ట సవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడారు.

వాహనాల విక్రయంలో మోటార్ వెహికల్‌ పన్నుల సవరణ బిల్లు ద్వారా ప్రభుత్వానికి పన్నులు సరిగా వస్తాయని మంత్రి అన్నారు.డీలర్ల రాయితీ నిలువరించేందుకే పన్నుల చట్ట సవరణ బిల్లు అని ఈ చట్ట సవరణ వల్ల వినియోగదారులకు పెద్దగా ఇబ్బంది ఉండదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.

తెలంగాణ మోటారు వాహన పన్నుల చట్టం 1963లోని సెక్షన్ 2కి సవరణ చేయాలని ప్రతిపాదించామని వాహనం ధరపై ఎటువంటి నిర్వచనం లేనందున వాహనం ధర యొక్క నిర్వచనాన్ని క్లాజ్ (ఏ) తర్వాత క్లాజ్ (ఏఏ)గా చట్టంలో చేర్చినట్లు మంత్రి వివరించారు.వాహనం యొక్క ధర తయారీదారు నిర్ణయించిన వాహనం యొక్క ఎక్స్-షోరూమ్ ధర కంటే తక్కువగా ఉండకూడదన్నారు.

దిగుమతి చేసుకున్న మోటారు వాహనం విషయంలో, బిల్ ఆఫ్ ఎంట్రీలో చూపిన ధర కస్టమ్స్ డ్యూటీ, సేల్స్ టాక్స్ లేదా జీఎస్టీ వర్తించే విధంగా ఏదైనా ఇతర విధింపు కలిగి ఉంటుందన్నారు.డీలర్లు డిస్కౌంట్ చూపించిన తర్వాత ఇన్‌వాయిస్‌లు జారీ చేస్తున్నారని అందువల్ల ఇన్‌వాయిస్ ధర ఎక్స్-షోరూమ్ ధర కంటే తక్కువగా ఉంటుందని దాని ఫలితంగా ప్రభుత్వానికి లైఫ్ టాక్స్‌లో రాబడి నష్టం జరుగుతుందన్నారు.

మోటారు వాహనాల జీవిత పన్ను చెల్లింపుల్లో అవకతవకలను అరికట్టేందుకు 1963 ఎంవీ యాక్ట్‌ను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.ఆయా వాహనాలపై జీవితపన్నును తగ్గించుకునేందుకు ఖరీదు ఎక్కువైనప్పటికీ తక్కువ ధరతో ఇన్‌వాయి్‌సలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు సవరణ బిల్లును ప్రవేశపెట్టామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అన్ని ఆటోమొబైల్ డీలర్లు వాహనం యొక్క నిర్దిష్ట వేరియంట్ ధర యొక్క ఏకరూపతను నిర్ధారించడానికి ఈ బిల్లు ఎంతో దోహద పడుతుందన్నారు.లారీల అంతర్రాష్ట్ర పన్నులపై ఏపీ అధికారులతో మాట్లాడుతున్నామని త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుంది అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.

గ్రీన్‌ ట్యాక్స్‌ అనేది కేంద్రప్రభుత్వం తెచ్చిందని అనివార్యంగా ఇతర రాష్ట్రాలతో సమానంగా ఆలోచించి సహేతుకంగానే తెలంగాణలో పన్నును విధించామని వెల్లడించారు.అలానే రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు రవాణా సౌకర్యం కొరకు ఆర్టీసీ బస్సు ఉచిత పాసులు అంశాన్ని పరిశీలించి పరిష్కరిస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube