సైమా అవార్డులతో పుష్ప టీమ్.. తగ్గేదేలే హుక్ స్టెప్ తో ఇరగదీసారుగా!

సౌత్ ప్రముఖ వేడుకల్లో ఒకటైన సైమా అవార్డ్స్ అంగరంగ వైభవంగా మొన్న బెంగుళూరు లో జరిగాయి.ఈసారి కూడా చాలా ప్రతిభావంతులైన నటీనటులు అవార్డులను అందుకున్నారు.

 Pushpa Team With Siima Awards, Pushpa,allu Arjun, Pushpa 2 , Director Sukumar, R-TeluguStop.com

ఇక ఈ వేడుకలో ముఖ్యంగా పుష్ప సినిమా అన్నిటికంటే ఎక్కువ అవార్డులు అందుకున్న విషయం ఇప్పటికే అందరికి తెలుసు.అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా అన్ని విభాగాల్లో అవార్డులను అందుకుని తగ్గేదేలే అంటూ మరోసారి నిరూపించుకుంది.

అల్లు అర్జున్ హీరోగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి అన్ని రికార్డులను తిరగ రాసింది.

ఇక సైమా అవార్డ్స్ లో ఈ సినిమాకు చాలా అవార్డులు వరించాయి.దీంతో పుష్ప సినిమా పేరు నిన్న, మొన్న సోషల్ మీడియాలో మరుపొగి పోయింది.

మొత్తంగా ఏడు అవార్డులను దక్కించుకుంది.దీంతో యూనిట్ సభ్యులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ తమకు వచ్చిన అవార్డులతో ఫొటోకు ఫోజులిచ్చారు.

Telugu Allu Arjun, Sukumar, Pushpa, Pushpasiima, Siima-Movie

అవార్డులు అందుకున్న తర్వాత అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, జగదీశ్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కలిసి తమ ఆవార్డులతో ఫోటో దిగి హుక్ స్టెప్ తగ్గేదేలే ఫోజ్ ఇచ్చిన ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.ఈ ఫోటో ఇప్పుడు అందరిని అలరిస్తుంది.అవార్డులు అందుకున్న ఆనందం మొత్తం వీరి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube