సాధారణంగా సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్లకు అటు నిర్మాతల దృష్టిలో, ఇటు హీరోల దృష్టిలో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.సక్సెస్ ఫుల్ డైరెక్టర్లకు సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది.
ఒక్క సినిమా సక్సెస్ సాధిస్తే డైరెక్టర్ల రెమ్యునరేషన్ సైతం అమాంతం పెరుగుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.అయితే కొందరు డైరెక్టర్లు మాత్రం సక్సెస్ లో ఉన్నా సైలెంట్ గా ఉండటం గమనార్హం.
మరి కొందరు డైరెక్టర్లు గతంలో సక్సెస్ సాధించినా ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు రావడంతో కెరీర్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు.దర్శకుడు శ్రీను వైట్ల గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
కొన్నేళ్ల క్రితం వరకు ఫ్యామిలీతో సహా థియేటర్లలో చూసే సినిమాలను తెరకెక్కించిన శ్రీనువైట్లకు వరుసగా నాలుగు ఫ్లాపులు రావడంతో కొత్త ఆఫర్లు ఇచ్చేవాళ్లు కరువయ్యారు.
గోపీచంద్ తో శ్రీనువైట్ల ఒక సినిమా తీస్తారని వార్తలు వస్తున్నా అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

మరో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల సినీ కెరీర్ లో కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నారప్ప లాంటి హిట్లు ఉన్నా ఈ దర్శకునికి సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడం లేదు.గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో సక్సెస్ సాధించిన విజయ్ కుమార్ కొండా ఆ తర్వాత తెరకెక్కించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో కొత్త ఆఫర్లు లేక ఇబ్బంది పడుతున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో గతేడాది సక్సెస్ అందుకున్న బొమ్మరిల్లు భాస్కర్ కు సైతం ఇదే పరిస్థితి ఎదురైంది.కందిరీగ మినహా కెరీర్ లో మరో సక్సెస్ లేని సంతోష్ శ్రీనివాస్ కు సైతం కొత్త సినిమా ఆఫర్లు రావడం కష్టమవుతోంది.సుజిత్, బుచ్చిబాబు, రాధాకృష్ణ కుమార్, రాహుల్ సాంకృత్యాన్, వేణు శ్రీరామ్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటూ ఉండటం గమనార్హం.







