చెన్నైలో తెలుగు సినిమా అంటే బన్నీ సినిమానే.. దర్శకుని షాకింగ్ కామెంట్స్!

ఈ ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై సక్సెస్ సాధించిన సినిమాలలో ఒకే ఒక జీవితం సినిమా ఒకటి.సినిమా రిలీజ్ రోజున ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు బుకింగ్స్ పుంజుకున్నాయి.

 Director Sri Kartheek Comments About Allu Arjun Details, Allu Arjun, Oke Oka Jee-TeluguStop.com

గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని శర్వానంద్ కు ఈ సినిమాతో ఆయన కోరుకున్న సక్సెస్ అయితే దక్కింది.ఈ సినిమా సక్సెస్ తో దర్శకుడు శ్రీ కార్తీక్ పేరు మారుమ్రోగుతోంది.

టైమ్ ట్రవెల్ కాన్సెప్ట్ తో ఒకే ఒక జీవితం కథను తెరకెక్కించిన శ్రీ కార్తీక్ తన దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.అయితే ఈ దర్శకుడు తన తర్వాత సినిమాను బన్నీ హీరోగా తెరకెక్కించాలని భావిస్తుండటం గమనార్హం.

బన్నీ తను చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఐదేళ్లు అయినా ఎదురుచూడటానికి సిద్ధమేనని శ్రీ కార్తీక్ కామెంట్లు చేశారు.చెన్నైలో తెలుగు సినిమా అంటే బన్నీనే అని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

శ్రీ కార్తీక్ మాట్లాడుతూ తెలుగులోనే తర్వాత సినిమాను సైతం తెరకెక్కించనున్నానని ఆయన అన్నారు.

Telugu Allu Arjun, Sri Kartheek, Sharwanad, Srikartheek-Movie

రియలిజం ఫాంటసీ సబ్జెక్ట్ తన దగ్గర ఉందని ఈ సినిమాను భారీ బడ్జెట్ లో తెరకెక్కించాలని ఉందని బన్నీ కోసం ఈ కథను సిద్ధం చేశానని ఆయన తెలిపారు.మరి శ్రీ కార్తీక్ సిద్ధం చేసిన కథకు బన్నీ ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది.బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమాకు నిర్మాత దొరకడం కష్టం కాదు.

Telugu Allu Arjun, Sri Kartheek, Sharwanad, Srikartheek-Movie

తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా బన్నీకి అభిమానులని శ్రీ కార్తీక్ వెల్లడించారు.అయితే ఒకే ఒక జీవితం సినిమాకు హిట్ టాక్ వచ్చినా ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ పైనే శ్రీ కార్తీక్ కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube