సమంత విరాళాలు ఇవ్వడం వెనుక రహస్యం ఏమిటో?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కెరీర్ పరంగా బిజీ బిజీగా మారిన సమంత ఆ తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా మారింది.

 Samantha Giving Large Amount Of Donations Details, Samantha, Tollywood, Social M-TeluguStop.com

కానీ గత రెండు మూడు వారాలుగా సమంత సోషల్ మీడియాలో కనిపించడం లేదు.ఇదే విషయం పట్ల అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ ఆమె మాత్రం ఆ విషయాల పట్ల స్పందించడం లేదు.

అయితే ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న సమంత మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే ఇటీవల పూజలు నిర్వహించినట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు కూడా తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఆమె ఒక వేద పాఠశాలలో పూజలు చేసినట్లుగా తెలుస్తోంది.ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్న సమంత నిరుపేదలకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తుంది అన్న వార్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇటీవల ఆమె తన క్షేమం కోసం సికింద్రాబాద్ లోని ఓ వేద భవన్ లో హోమం చేసినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.కాగా ఆ సమయంలో సమంత గురుకుల ఆశ్రమానికి భారీగా విరాళాలు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Ashrams, Divorce, Naga Chaitanya, Samantha, Samantha Pooja, Samanthaved,

అలాగే మరొక ఆశ్రమానికి ఆవులను విరాళంగా ఇవ్వాలనే ఆలోచనలో సమంత ఉన్నట్లు సమాచారం.అయితే సమంత క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ దేవుళ్లను కొలవడం, హిందూ దేవుళ్లకు వెళ్లి దేవుళ్లను పూజించడం చేస్తోంది.అందుకు నిదర్శనంగా ఎన్నోసార్లు సమంత తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించిన సంగతి తెలిసిందే.మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే సమంత స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube