ఈ దేశంలో దోమలు అస్సలు ఉండవట.. ఎందుకంటే..!

ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో దోమల బెడద చాలా అధికంగా ఉంటుంది.ఈ దోమల వల్ల ఎంతోమంది ఎన్నో రోగాల బారిన పడి చనిపోతున్నారు కూడా.

 There Are No Mosquitoes In This Country Because , No Mosquito Country, Viral La-TeluguStop.com

అయితే ఒక దేశంలో మాత్రం ఒక్క దోమ కూడా కనిపించదు.ఈ దోమలు లేని దేశంలో రాత్రిపూట దుప్పట్లు కూడా కప్పుకోవాల్సిన అవసరం రాదు.

ఆ దేశం మరోదే కాదు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఐస్‌లాండ్.ఈ దేశంలో ఎక్కడ భూతద్దం పెట్టి వెతికినా ఒక్క దోమ కూడా కనిపించదు.ఈ దేశంలో నెలకొన్న వాతావరణ పరిస్థితే దీనికి కారణం.ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది.ఇది దోమలకు చాలా ప్రతికూలంగా మారి వాటి మనుగడను అసాధ్యం చేస్తుంది.అందుకే ఇక్కడ దోమలు పుట్టడం, జీవించడం అస్సలు జరగదు.

మరో విశేషం ఏంటంటే, ఐస్‌లాండ్ దేశంలో దోమలు మాత్రమే కాదు పాములు, ఇతర సరీసృపాలు కూడా కనిపించవు.మనుషులకు హాని చేసే ఈ జీవులు ఇక్కడ లేకపోవడం వల్ల చాలామంది బయటే ఎంచక్కా క్యాంపింగ్ వేసుకొని ఎంజాయ్ చేస్తుంటారు.

మన భారతదేశం లాగానే ఇక్కడ సాధారణ వాతావరణం ఉండదు.ఈ దేశంలో ఎక్కడ కాలు పెట్టినా మంచు తప్ప నేల అనేది కనిపించదు.అయితే మంచు ఎక్కువగా కురిసే లేదా కనిపించే ఇతర దేశాల్లో దోమలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం అస్సలు ఉండలేవు.

Telugu Iceland, Latest, Mosquitoes, Mosquito-Latest News - Telugu

శాస్త్రవేత్తల ప్రకారం, దోమలు ఏ దేశంలో లేకపోవడానికి ప్రధాన కారణం అక్కడ నమోదయ్యే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు.ఒక్కోసారి ఈ దేశంలో ఉష్ణోగ్రతలు -38 ° డిగ్రీ సెల్సియస్ వరకు పడిపోతాయి.అప్పుడు నీరు, ఇతర ద్రవాలన్నీ చాలా గట్టిగా గడ్డకట్టుకుపోతాయి.

సాధారణంగా నీటిలోనే దోమలు గుడ్లు పెడతాయి.కానీ ఇక్కడ మంచుగడ్డలు తప్ప నీరు కనిపించదు అవి గుడ్లు పెట్టలేవు.

వాటి మనుగడ కూడా ఎక్కువ కాలం సాగదు.అందువల్ల ఇవి ఇక్కడ పూర్తిగా అంతరించిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube