రౌడీ హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చినటువంటి మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం లైగర్.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
ఇలా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమా కూడా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.పూరి జగన్నాథ్ జనగణమన సినిమాని విజయ్ దేవరకొండతో చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
విజయ్ దేవరకొండ పూజా హెగ్డే జంటగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది.ఇక టైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో జనగణమన నిర్మాతలు పూరీ జగన్నాథ్ పై నమ్మకం లేక ఈ సినిమా నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి.
ఇలా నిర్మాతలు తప్పుకోవడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి.ఈ విధంగా జనగణమన సినిమా గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ, చార్మి, పూరి జగన్నాథ్ ఈ విషయంపై ఏ మాత్రం స్పందించలేదు.

ఇకపోతే తాజాగా సైమా వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి విజయ్ దేవరకొండకు జనగణమన సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వస్తున్నాయి.ఎంతవరకు నిజం అంటూ ఆయనను ప్రశ్నించగా వెంటనే విజయ్ దేవరకొండ ప్రస్తుతం జనగణమన సినిమా గురించి మాట్లాడటం అవసరమా…ఆ సినిమా గురించి మర్చిపోండి మనం ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చాం ఎంజాయ్ చేయండి అంటూ ఈయన సమాధానం చెప్పారు.ఈ విధంగా విజయ్ దేవరకొండ జనగణమన సినిమా గురించి కూడా మాట్లాడటానికి ఇష్టపడకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలకు బలం చేకూరాయి.







