శర్వా ఒకే ఒక జీవితం కి వచ్చింది ఎంత? ఇంకా రావాల్సింది ఎంత?

శర్వానంద్ హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా రూపొందిన ఒకే ఒక్క జీవితం సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా లో అమల అక్కినేని కీలక పాత్రలో నటించారు.

 Sharwanand Oke Oka Jeevitham Collections,oke Oka Jeevitham,sharwanand,ritu Varma-TeluguStop.com

ఇక శర్వానంద్ కి స్నేహితుల పాత్రల్లో వెన్నెల కిషోర్ మరియు ప్రియదర్శి నటించిన మెప్పించారు.ఈ సినిమా ఒక టైం ట్రావెల్ కాన్సెప్ట్ కథ ఆధారంగా రూపొందింది సెంటిమెంట్ తో పాటు వినోదాన్ని పండించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.

దాంతో మంచి వసూలు నమోదు అవుతున్నాయి.హీరో శర్వానంద్ చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి సక్సెస్ ని.కమర్షియల్ హిట్ ని దక్కించుకున్నాడు అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా దాదాపుగా 5 కోట్ల రూపాయల షేర్‌ ని వసూళ్లను నమోదు చేసింది.

Telugu Amala Akkkineni, Ritu Varma, Sharwanand-Movie

శర్వానంద్ కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఎనిమిది కోట్లకు పైగా బిజినెస్ చేయడం జరిగింది.అంటే సినిమాకు ఐదు కోట్ల వసూలు నమోదు అవ్వడంతో మరో మూడు కోట్ల వసూళ్లు సాధ్యం అయితే సినిమాకి బ్రేక్ ఈవెన్ అయినట్లే అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.శర్వానంద్ మరియు అమల అక్కినేని కాంబో సన్నివేశాల కోసం ఎంతో మంది సినిమాకు వెళ్ళవచ్చు అన్నట్లుగా అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.అమల అక్కినేని ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉన్నారని ఆమె అమ్మ పాత్రకు అర్థం అన్నట్లుగా నటించారు అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఈ సినిమాకు పాజిటివ్ బజ్ ఉంది.దాంతో ఈ సినిమా ఖచ్చితంగా ఆ మూడు కోట్లని సొంతం చేసుకొని బ్రేక్ ఈవెంట్ సాధిస్తుందని అంతే కాకుండా లాంగ్ రన్ లో మంచి లాభాలను నిర్మాతలకు మరియు బయ్యర్లకు తెచ్చిపెడుతుంది అంటూ నమ్మకం వ్యక్తం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube