టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.ఇటీవల కుప్పంలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో జైలుకు వెళ్లిన పార్టీ నేతల కుటుంబాలకు ఆయన ఫోన్ చేశారు.
వివిధ కేసుల్లో ఉన్న 70 మంది నేతల కుటుంబీకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
బాధిత కుటుంబాలు అధైర్య పడద్దొని, పార్టీ అన్ని విధాలుగా వారికి అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా కల్పించారు.
జైలులో ఉన్న వారిని వారం రోజుల్లో బయటకు తీసుకువస్తామన్నారు.హైకోర్టులో బెయిల్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.
ఈ క్రమంలో ఏ అవసరం ఉన్న పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.ఎల్లప్పుడు టీడీపీ నేతలు అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు.







