మునుగోడు కాంగ్రెస్ నేతలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీ టికెట్ ఆశించిన నేతలను తన నివాసానికి ఆయన ఆహ్వానించారని తెలుస్తోంది.
అభ్యర్థి పాల్వాయి స్రవంతితో పాటు ఆశావహులు చలమల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్ గౌడ్, కైలాష్ లతో భేటీ అయ్యారు.
టికెట్ ఆశపడి భంగపడిన వారికి నచ్చజెప్పిన రేవంత్ రెడ్డి పార్టీ కోసం పనిచేయాలని కోరారు.
అభ్యర్థి ఎంపిక విషయంలో తీసుకున్న ప్రమాణాలు, పార్టీ ప్రస్తుత పరిస్థితిని వివరించారని సమాచారం.ఈనెల 18 నుంచి ప్రచారం ప్రారంభించనున్న నేపథ్యంలో అందరూ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.







