అప్పట్లోనే రెమ్యునరేషన్ తో రికార్డ్ సృష్టించిన కృష్ణంరాజు.. పారితోషికం ఎంతంటే?

మాజీ కేంద్ర మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం అభిమానులను ఎంతగానో బాధపెట్టింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా సైతం కృష్ణంరాజు మృతికి సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.

 Krishnam Raju Remuneration Record Details Here Goes Viral , Krishnam Raju , Nar-TeluguStop.com

సినిమా ఇండస్ట్రీలో, రాజకీయాల్లో వివాదాలకు దూరంగా కృష్ణంరాజు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.అప్పట్లోనే రెమ్యునరేషన్ విషయంలో కూడా ఆయన రికార్డులు క్రియేట్ చేశారు.

కృష్ణంరాజు హీరోగా పరిచయమైన సమయంలోనే సినిమాకు 1,16,000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకునేవారని సమాచారం.ఇప్పుడు ఈ మొత్తం అంటే తక్కువ అయినా ఆ సమయానికి మాత్రం ఈ మొత్తం పారితోషికం అంటే చాలా ఎక్కువ మొత్తమే కావడం గమనార్హం.

అప్పట్లోనే ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుని కృష్ణంరాజు రెమ్యునరేషన్ విషయంలో ఊహించని స్థాయిలో రికార్డులు క్రియేట్ చేశారు.

కృష్ణంరాజు ఆస్తుల విలువ ఏకంగా 500 కోట్ల రూపాయలు అని బోగట్టా.

పలు ప్రాంతాలలో ఆయనకు ఉన్న ఇళ్ల విలువ 200 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం అందుతోంది. కృష్ణంరాజు దగ్గర ఉన్న వాహనాల విలువ 30 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది.

సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని ఆయన సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేశారు.

Telugu Amit Shah, Krishnam Raju, Narendra Modi, Rare-Movie

కృష్ణంరాజు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండేవారు.సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతోమందికి కృష్ణంరాజు సహాయం చేసినా ఆ సాయాల గురించి చెప్పుకోవడానికి ఆయన పెద్దగా ఇష్టపడలేదు.కృష్ణంరాజు మరణవార్త విని ప్రభాస్ శోకసంద్రంలో మునిగిపోయారని తెలుస్తోంది.

కృష్ణంరాజు కుటుంబ సభ్యులను ఓదార్చటం ఎవరి వల్లా కావడం లేదని బోగట్టా.కృష్ణంరాజు సాధించిన సినీ రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube