టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోగా విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు కృష్ణంరాజు నేడు అనారోగ్య సమస్యతో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే.ఈయన మరణ వార్త తెలుసుకున్న అభిమానులు సినీ ప్రముఖులు ఒక్కసారిగా దుఃఖ సాగరంలోకి వెళ్లిపోయారు.
గత కొద్ది రోజులుగా ఈయన అనారోగ్య సమస్యతో బాధపడుతూ హైదరాబాదులోని ప్రముఖ ఏఐజి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.ఈ క్రమంలోనే నేడు ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఈయన మరణ వార్త పై ఏఐజి వైద్యులు స్పందించి అసలు కారణం వెల్లడించారు.కృష్ణంరాజు గారికి రక్తప్రసరణ సరిగా జరగకపోవడంతోనే గత ఏడాది తన కాలికి సర్జరీ జరిగిందని వెల్లడించారు.
అయితే ఈయన దీర్ఘకాలకంగా మూత్రపిండాలు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.ఆగస్టు 5వ తేదీ కృష్ణంరాజు కోవిడ్ కారణంగా హాస్పిటల్లో చేరినట్లు వైద్యులు తెలియజేశారు.
అయితే కోవిడ్ కారణంగా ఈయనకు ఊపిరితిత్తుల సమస్య మరింత ఎక్కువగా అయ్యిందని డాక్టర్స్ పేర్కొన్నారు.

కృష్ణం రాజు గారి ఊపిరితిత్తుల్లో తీవ్ర న్యుమోనియా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు.కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బ తినడంతో ఈయన హాస్పిటల్ లో చేరినప్పటి నుంచి ఈయనకు వెంటిలేటర్ చికిత్స అందిస్తున్నట్లు ఏఐజి వైద్యులు వెల్లడించారు.ఇక ఆదివారం తెల్లవారుజామున 3:16గంటల సమయంలో ఈయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతోనే మృతి చెందారని వైద్యులు విడుదల చేసిన ప్రకటనలో ఈయన మృతికి అసలు కారణం వెల్లడించారు.ఇక ఈయన మరణ వార్త తెలుసుకున్నటువంటి సినీ ప్రముఖులు అభిమానులు ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.







