వొడాఫోన్ ఐడియా కంపెనీ ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లు తీసుకునే వారికి VIP లేదా ఫ్యాన్సీ నంబర్లను ఫ్రీగా ఆఫర్ చేస్తోంది.అంటే వీఐ యూజర్లు తమకు నచ్చిన నంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
నిజానికి ఈ ఫ్యాన్సీ నంబర్లు ఫ్రీగా రావడం చాలా అరుదు.వీటికి డిమాండ్, ప్రైస్ ట్యాగ్ కూడా ఎక్కువే.
ఎందుకంటే ఈ ఫోన్ నంబర్లు గుర్తుంచుకోవడం చాలా సులభం.బిజినెస్‌లకు, సెలబ్రిటీలకు ఈ నంబర్స్ బాగా యూజ్ అవుతాయి.
అయితే సామాన్యులు కూడా ఈ నంబర్స్‌ను ఇప్పుడు ఫ్రీగా పొందొచ్చు.వొడాఫోన్ ఐడియా చాలా ఫ్యాన్సీ నంబర్స్‌ను ఉచితంగానే ఆఫర్ చేస్తుంది.
ఆ నంబర్‌ను ఎలా పొందాలో ఇప్పుడు స్టెప్-బై-స్టెప్ చూద్దాం.
స్టెప్ 1 : మొదటగా యూజర్లు వీఐ అఫీషియల్ వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలి.
స్టెప్ 2: న్యూ కనెక్షన్ సెక్షన్‌పై నొక్కి ఫ్యాన్సీ నంబర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్ 3: లేదంటే myvi.in/new-connection/choose-your-fancy-mobile-numbers-online లింక్‌పై నొక్కాలి.
స్టెప్ 4: VIP ఫ్యాన్సీ నంబర్ సెలెక్ట్ చేసుకోవడానికి పిన్‌కోడ్, మొబైల్ నంబర్‌తో పాటు ఇతర వివరాలు అందించాలి.
స్టెప్ 5: ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లలో కావాల్సిన కనెక్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్ 6: నచ్చిన VIP ఫ్యాన్సీ నంబర్ కోసం సెర్చ్ చేయాలి.అలా కాదనుకుంటే వీఐ ఆఫర్ చేసిన నంబర్ల ఫ్రీ లిస్ట్ నుంచి ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్ 7: ఈ ఫ్రీ ప్రీమియం నంబర్లు నచ్చకపోతే.ఇతర ప్రీమియం నంబర్ కోసం మనీ చెల్లించి దానిని సెలెక్ట్ చేయవచ్చు.
స్టెప్ 8: సిమ్ లేదా కనెక్షన్ ఆర్డర్ ఫినిష్ చేయడానికి అన్ని వివరాలు అందించి అడ్రస్ పేర్కొనాలి.
స్టెప్ 9: పేమెంట్ చేశాక.మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి.అంతే, ఆ VIP/ఫ్యాన్సీ నంబర్ నేరుగా మీ ఇంటి వద్దకే డెలివరీ అవుతుంది.







