సౌత్ ఇండస్ట్రీ అంటే తక్కువ చేసి చూసిన వారికీ ఇప్పుడు మన సౌత్ అంటేనే భయపడి పోయే స్థాయికి మన సినిమా ఎదిగింది.బాలీవుడ్ వారు మన సౌత్ ఇండియా నుండి వచ్చే సినిమాలు చూసి వెన్నులో వణుకు మొదలైంది.
బాలీవుడ్ సినిమాలు ఈ మధ్య కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవ్వడం లేదు.
కానీ మన సినిమాలు మాత్రం వందల కోట్లు వసూలు చేస్తూ అక్కడి ప్రేక్షకులను ఆకట్టు కుంటున్నాయి.
ఇప్పటికే వరుస సినిమాలు హిట్ అవుతూ వస్తున్నాయి.సౌత్ సినిమాలంటే కమర్షియల్ కంటే కంటెంట్ బాగుటుంది అనే పేరు వచ్చింది.
ఈ మధ్యన పలు సినిమాలు మన తెలుగుతో పాటు బాలీవుడ్ లో మంచి మ్యాజిక్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు మరొక సినిమా ఎలాంటి బజ్ లేకుండా వచ్చి మంచి హిట్ అనిపించుకుంది.
శర్వానంద్ తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.వరుస ప్లాప్స్ తో ఈయన సినిమాపై పెద్దగా బజ్ లేకుండానే రిలీజ్ అయ్యిన ఒకే ఒక జీవితం సాలిడ్ హిట్ టాక్ తెచ్చుకుంది.
సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది.

ఈ సినిమా ఇక్కడ మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి టాక్ తో వసూళ్లు రాబడుతూ మరిన్ని స్క్రీన్ లు కూడా పెంచుకుంటూ వెళ్తుంది.దీంతో కార్తికేయ 2 తరహాలోనే ముందు ముందు ఈ సినిమా కూడా మంచి మ్యాజిక్ క్రియేట్ చేయబోతుంది అని అంటున్నారు.డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో శ్రీ కార్తీక్ తెరకెక్కించారు.







