హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం.ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ విడుదలై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఇక దక్షిణాది సిని ఇండస్ట్రీలోనే కాకుండా హిందీ భాషలో కూడా ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.అద్భుతమైన ప్రేమ కథ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడి హృదయాన్ని ఆకట్టుకుందనే చెప్పాలి.
ఇక ఈ సినిమాపై ఎంతోమంది సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.
ఇకపోతే ఈ సినిమా గురించి తాజాగా రచయిత పరుచూరి గోపాలకృష్ణ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ సీతారామం సినిమా విభిన్నమైన పార్శ్వాలను స్పృచించే ప్రేమ, ఆకట్టుకునే యుద్ధ నేపథ్యం, ప్రేక్షకుల మదిలో విషాదాంతం లాంటి అంశాలు సినిమాని మరుపురాని చిత్రంగా నిలబెట్టాయని పరుచూరి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.గతంలో ఇదే తరహా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి కమర్షియల్ గా ఎంతో మంచి విజయాన్ని అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయని ఈయన వెల్లడించారు.

సీతారామం సినిమా చూస్తుంటే తనకు ఒక బాలీవుడ్ సినిమా గుర్తుకు వస్తుందని తెలిపారు.షారుక్ ఖాన్, ప్రీతి జింటా, రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలలో నటించిన వీర్ జారా సినిమా గుర్తుకు వస్తుందంటూ సీతారామం సినిమాని బాలీవుడ్ చిత్రంతో పోల్చారు.అయితే క్లైమాక్స్ లో వాళ్ళిద్దరిని కలిసినట్టు సినిమాని కనక చూపించి ఉంటే సినిమా వేరే లెవెల్ లో ఉండేదని, అలా కాకుండా హీరో పాత్రను ప్రశ్నార్థకంగా మార్చడంతో ప్రేక్షకులనుకంటతడి పెట్టించిందని వెల్లడించారు.ఏది ఏమైనా ఒక అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని తెరకెక్కించిన హనురాగపూడి పై పరుచూరి ప్రశంసలు కురిపించారు.







