సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేసీఆర్ వ్యవహారశైలి కూట్లో రాయి తీయలేని వాడు.
ఏట్లో రాయి తీస్తానన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని మండిపడ్డారు.
అలాంటి వ్యక్తి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి చేసేది ఏముందని ప్రశ్నించారు.
చౌటుప్పల్ లో చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే ఈటల నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేశారని విమర్శించారు.
దేశంలో, రాష్ట్రంలో కేసీఆర్ ఒక చెల్లని రూపాయిగా మారిపోయారని దుయ్యబట్టారు.







