టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి సమర్పించడంతో పాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మాస్తం ప్రమోషన్స్ కు హాజరు కావడంతో విడుదలకు ముందు ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే.సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు పరవాలేదనే స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు ఈ సినిమాకు 6.2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 5.5 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సినిమా హక్కులు తక్కువ రేటుకే విక్రయించడంతో ఈ సినిమా బయ్యర్లకు భారీగానే లాభాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.బాలీవుడ్ సినిమా ధూమ్3 4.7 కోట్ల రూపాయల కలెక్షన్లతో క్రియేట్ చేసిన రికార్డ్ ను ఈ సినిమా బ్రేక్ చేసింది.మైథలాజికల్ అడ్వెంచరస్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కగా కొంతమందికి ఈ సినిమా నచ్చితే మరి కొందరికి ఈ సినిమా నచ్చలేదు.
ఈ సినిమాలోని గ్రాఫిక్స్ సీన్లు నాసిరకంగా ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
రాజమౌళికి ఈ సినిమాతో భారీగానే లాభాలు అందాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ సినిమా విడుదలైంది.
బ్రహ్మాస్త్రం సినిమా కథ గురించి ఎన్నో వార్తలు వైరల్ కాగా ఆ వార్తల్లో నిజం లేదని సినిమా విడుదలయ్యాక తేలిపోయింది.

బ్రహ్మాస్త్ర పార్ట్1 అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందకపోయినా కమర్షియల్ గా సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి.బ్రహ్మాస్త్ర పార్ట్2 దిశగా అడుగులు పడతాయో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.బ్రహ్మాస్త్ర పార్ట్2 బడ్జెట్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ సినిమాను కూడా తెలుగు రాష్ట్రాల్లో జక్కన్న సమర్పిస్తారేమో చూడాల్సి ఉంది.







