రజినీ టైటిల్ తో శింబు ప్రయత్నం..!

తమిళ స్టార్ హీరో శింబు సక్సెస్ ఫుల్ డైరక్టర్ గౌతం వాసుదేవ మీనన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా వెందు తనిందదు కాడు.సెప్టెంబర్ 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయిన తెలుగు నిర్మాత స్రవంతి రవికిశోర్ ఈ సినిమాని తెలుగులో డబ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

 Simbu Coming With Rajinikanth Title For Telugu Audiance Details, Gautham Vasudev-TeluguStop.com

అనుకోవడమే ఆలస్యం తమిళం తో పాటుగా తెలుగు వర్షన్ ని కూడా అదే రోజు తెచ్చేలా కార్యక్రమాలు మొదలు పెట్టారు.ఇక శింబు వెందు తనిందదు కాడు సినిమాని తెలుగులో ది లైఫ్ ఆఫ్ ముత్తు అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ముత్తు సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించింది.ఇప్పుడు అదే టైటిల్ తో వస్తున్నాడు లిటిల్ సూపర్ స్టార్.శింబు, గౌతం మీనన్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది.ఆల్రెడీ ఇప్పటికే చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ కాగా ఇప్పుడు ఇదే కాంబోలో వస్తున్న మూడవ సినిమాతో కూడా హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నారు.రజినీ టైటిల్ తో తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తున్న శింబు ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube