క్వారీ ఇంజన్లు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి - క్వారీ యజమానురాలు కొమ్మినేని మమత

ప్రభుత్వం లీజుకు ఇచ్చిన గ్రానైట్ క్వారీపై విష్ణు గ్రానైట్ కు చెందిన యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతూ అనధికారికంగా ఇంజన్లు ధ్వంసం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు, క్వారీ యజమాని కొమ్మినేని మమత జిల్లా అధికారులను కోరారు.శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 156/3లో హెక్టార్ ప్రభుత్వ భూమిని గ్రానైట్ క్వారీగా 2009 నుండి 2029 వరకు 20సంవత్సరాలు కొమ్మినేని మమత పేరుతో అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు.2013వరకు క్వారీ పనులు నిర్వహించామని తెలిపారు.

 Strict Action Should Be Taken Against Those Who Vandalized The Quarry Engines Ko-TeluguStop.com

విష్ణు గ్రానైట్ యజమాని కిషన్ అగర్వాల్ మా పట్టా భూమిలో క్వారీ పనులు చేయొద్దని బెదిరించారు.కేసుపెట్టి కోర్టుకు వెళ్లారు.2016లో మాకు అనుకూలంగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది అయినా బెదిరింపులు ఆగడంలేదు.ఆర్థిక సమస్యలు వలన మా బంధువుల సహకారంతో ప్రభుత్వానికి లీజుకు కట్టవలసిన 14లక్షల రూపాయలు కట్టి మూడు ఇంజన్లుతో క్వారీ పని ప్రారంభించాం.విష్ణు గ్రానైట్ వారు పనులు చేయొద్దని మూడు ఇంజన్లను రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.

అనుమతి ఉన్న పత్రాలు పరిశీలించి వారిని మందలించి పని ప్రారంభించికోవచ్చని ఇంజన్లను అప్పగించారు.

మరలా క్వారీలో పని ప్రారంభం కావడంతో విష్ణు గ్రానైట్ మేనేజర్ సుధాకర్, సూపర్ వైజర్ సయ్యద్ హుస్సేన్, వాచ్ మెన్ మంగ్య దూషించుకుంటూ ఇంజన్లు ఆపివేశారు.

పోలేపల్లి మాజీ సర్పంచ్ అక్కనపల్లి వెంకన్న ఫోన్లో బెదిరించాడు.అదేరోజు సెప్టెంబర్ 8 గురువారం రాత్రి తొండల రాంబాబు తన అనుచరులతో రెండు ఇంజన్లను ధ్వంసం చేసి నీళ్లలో పడేశారు.

పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేశాము.ప్రభుత్వ అనుమతి ఉన్నప్పటికీ బెదిరింపులకు పాల్పడుతూ ఇంజన్లు ధ్వసం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube