గడిచిన రెండు మూడు వారాలుగా అమెరికాలో భారతీయులు విద్వేష దాడులకు గురవుతున్న సంగతి తెలిసిందే.డల్లాస్‌లోని ఓ రెస్టారెంట్ పార్కింగ్ ఏరియాలో విద్వేష దాడి చోటు చేసుకుంది.
ఎస్మలార్డా ఆప్టన్ అనే మహిళ భారత సంతతి మహిళలను అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు దాడికి దిగింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన మరిచిపోకముందే.
కాలిఫోర్నియా రాష్ట్రంలో మరో విద్వేషదాడి జరిగింది.అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే .బాధితుడు, నిందితుడు ఇద్దరూ భారతీయులే కావడం.
ఈ ఘటనలపై అగ్రరాజ్యంలో ఇండో అమెరికన్ కమ్యూనిటీ భగ్గుమంటోంది.
అప్పటికి కంటి తుడుపు చర్యలే తప్పించి శాశ్వత ప్రాతిపదికన కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు మాత్రం లేదు.అయితే అమెరికన్లు అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ భారతీయులతో పాటు విదేశీయులను టార్గెట్ చేస్తున్నారు.
భౌతికదాడులతో పాటు జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నారు.పోలండ్ పర్యటనకు వచ్చిన ఓ అమెరికన్ టూరిస్ట్ భారతీయుడిపై విద్వేషం వెళ్లగక్కాడు.
ఇప్పుడు ఏకంగా ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌కి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది.గురువారం ఐదు ఆడియో సందేశాలు తన మొబైల్‌కి వచ్చాయని.
ఇందులో అశ్లీల కంటెంట్ కూడా వున్నట్లు ప్రమీలా జయపాల్ తెలిపారు.ఒకదానిలో మీ భారతదేశానికి తిరిగి వెళ్లిపో అంటూ ఓ పురుషుడి వాయిస్ కూడా వినిపించింది.
హింసను ప్రోత్సహించే జాత్యహంకారం, లింగ వివక్షను ఎట్టిపరిస్ధితుల్లోనూ అంగీకరించేది లేదని ప్రమీలా జయపాల్ అన్నారు.

ఇకపోతే.ఈ ఏడాది జూలైలో ప్రమీలా జయపాల్‌ను హత్య చేస్తానంటూ బెదిరించిన 49 ఏళ్ల అమెరికా పౌరుడిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది.నిందితుడు ప్రమీల ఇంటి బయట తుపాకీతో నిలబడి ఆమెను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడటమే కాకుండా.
‘‘గో బ్యాక్ టు ఇండియా’’ అంటూ నినాదాలు చేశాడు.దీనికి సంబంధించి నిందితుడిపై పలు అభియోగాలు మోపారు.
నిందితుడిని బ్రెట్ ఫోర్సెల్‌గా గుర్తించారు.ఘటన జరిగిన రోజున ఫోర్సెల్.40 క్యాలిబర్ గ్లాక్ సెమీ ఆటోమేటిక్ పిస్టల్‌తో ప్రమీలా జయపాల్ ఇంటి వద్ద కాచుకుని కూర్చొన్నాడని అధికారులు తెలిపారు.జూలై 9న ప్రమీలా జయపాల్, ఆమె భర్తకు వెస్ట్ సీటెల్‌లోని తమ ఇంటి బయటి నుంచి పెద్దగా అరుపులు, కేకలు వినిపించాయి.
జయపాల్ భర్త.స్టీవ్ విలియమ్సన్ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు బయటకు వెళ్లాడు.
అక్కడ కొందరు ‘‘గో బ్యాక్ టు ఇండియా’’ అంటూ బెదిరించారు.అయితే విలియమ్సన్ తలుపు తెరిచి చూడగా… ఇంటి బయట వున్న ఓ వ్యక్తి వాహనంలోకి ఎక్కి వేగంగా వెళ్లిపోయాడు.







