కాంగ్రెస్ నేత, పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసుతో దేశవ్యాప్తంగా వార్తల్లో ప్రముఖ వ్యక్తిగా నిలిచిన కెనడియన్ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్, మరో నలుగురు వ్యక్తులపై పంజాబ్ పోలీసులు శుక్రవారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు.కాంగ్రెస్ నాయకుడి హత్య కేసులో కొందరు సాక్షులను బెదిరించినందుకు గాను పోలీసులు పలు అభియోగాల కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ సాక్షిగా వున్న గుర్జాస్వీందర్ సింగ్ 2021 ఫిబ్రవరిలో కొత్వాలి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో .బ్రార్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని తెలిపాడు.
హత్య కేసులో కోర్టుకు హాజరై సాక్ష్యం చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బ్రార్ తనను బెదిరించాడని గుర్జాస్వీందర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇందులో గుర్జాస్వీందర్ తనను మాత్రమే కాకుండా మరికొందరు సాక్షులకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయని చెప్పాడు.
గతేడాది ఫిబ్రవరి 18న యూత్ కాంగ్రెస్ జిల్లా చీఫ్, జిల్లా పరిషత్ సభ్యుడు గుర్లాల్ పహిల్వాన్ హత్యకు గురైన సంగతి తెలిసిందే.పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో పహిల్వాన్ హత్యలో బ్రార్ అతని సహాయకుడు పాల్గొన్నారని… గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ దీనికి సూత్రధారి అని పేర్కొన్నారు.

ఎవరీ గోల్డీ బ్రార్:
సిద్దూ హత్యతో గోల్డీ బ్రార్ పేరు మారు మోగిపోతోంది.అతను ఎవరు.ఏం చేసేవాడన్న దానిపై నెటిజన్లు విపరీతంగా సెర్చ్ చేస్తున్నాడు.ఇతని అసలు పేరు సతీందర్ సింగ్.పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ ప్రాంతానికి చెందిన వాడు.కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో బిష్ణోయ్ తరపున గోల్డీ బ్రార్ వసూళ్ల దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ క్రమంలో లారెన్స్ బిష్ణోయ్‌కి.
మరో గ్యాంగ్‌స్టర్ దవిందర్ బంభిహాకు మధ్య గ్యాంగ్ వార్ నడుస్తోంది.పంజాబ్ సహా ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో రెండు గ్యాంగ్‌లు పరస్పరం దాడులు, ప్రతిదాడులకు పాల్పడుతున్నాయి.







