యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా చేస్తున్న దర్శకుడు శంకర్ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ను మధ్యలో వదిలేసి రామ్ చరణ్ తో సినిమాను మొదలు పెట్టిన విషయం తెలిసిందే.కమల్ హాసన్ సినిమా నిర్మాతలతో చర్చలు జరిపిన తర్వాత మళ్లీ ఆ సినిమాను మొదలు పెట్టడం జరిగింది.
తమిళ సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు మధ్యవర్తిత్వం వహించడంతో ఇండియన్ 2 సినిమా మళ్లీ ప్రారంభమైంది.గత నెలలో ప్రారంభమైన ఇండియన్ 2 సినిమా రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు చెన్నైలో జరుగుతూనే ఉన్నాయి.
ఇదే సమయంలో నేటి నుండి రామ్ చరణ్ తో సినిమా షూటింగ్ ని హైదరాబాదులో పునః ప్రారంభించారు.ఒక దర్శకుడు రెండు సినిమాలు ఒకే సారి అక్కడ మరియు ఇక్కడ ఎలా షూటింగ్ చేస్తున్నారంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాకు సంబంధించిన సెకండ్ యూనిట్ కమల్ హాసన్ లేకుండా చిత్రీకరణ చేస్తున్నారు.
ఆ సన్నివేశాలకు దర్శకుడు శంకర్ కేవలం ఆన్లైన్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారని.
శంకర్ పూర్తిగా రామ్ చరణ్ సినిమా యొక్క షూటింగ్ విషయంలో దృష్టి పెట్టారని సమాచారం అందుతుంది.మరో వారం నుండి పది రోజుల పాటు అక్కడ షూటింగ్ కంటిన్యూ అవుతుంది.
అదే విధంగా రామ్ చరణ్ తో ప్రస్తుతం శంకర్ మూడు వారాల పాటు కంటిన్యూస్ గా షెడ్యూల్ ని ప్లాన్ చేశాడు.హైదరాబాద్ తో పాటు వైజాగ్ లో కూడా రామ్ చరణ్ మరియు శంకర్ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఏర్పాటు చేసినట్లుగా నిర్మాత దిల్ రాజు సన్నిహితులు చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం భారీ ఎత్తున జూనియర్ ఆర్టిస్టులను వినియోగిస్తున్నట్లుగా దిల్ రాజు ఆఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను విడుదల చేయడం కోసం ఈ ఏడాది చివర్లో షూటింగ్ ముగించాలని దర్శకుడు శంకర్ పట్టుదలతో ఉన్నాడు.
అది ఎంతవరకు సాధ్యమయ్యేది చూడాలి.







