విజయవాడలో ఇటీవల జరిగిన దాడిలో గాయపడిన టీడీపీ నేత చెన్నుపాటి గాంధీని ఆ పార్టీ ఇతర నాయకులు పరామర్శించారు.దేవినేని ఉమ, యరపతినేని, రావి వెంకటేశ్వరరావులు ఆయనను కలిసి.
ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.విజయవాడలో జరిగే అరాచకాలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.
కుట్రపూరితంగానే టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.చెన్నుపాటిపై జరిగిన దాడి వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.







