ప్రేమ అనే శకం ఎప్పుడో ముగిసింది.. పెళ్లి కూడా డౌటే: రెజీనా

కండనాళ్ మొదల్ అనే సినిమాతో 2005వ సంవత్సరంలో కోలీవుడ్ ఇండస్ట్రీకి నటిగా పరిచయమయ్యారు రెజీనా. ఇలా నటిగా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

 Heroine Regina Cassandra Shocking Comments About Love And Marriage Details, Marr-TeluguStop.com

అయితే ఈ మధ్యకాలంలో ఈమె హీరోయిన్ గా సినిమాలో నటించకపోయిన పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో కూడా ఈమె స్పెషల్ సాంగ్ లో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

అయితే ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్న రెజీనా వృత్తిపరమైన జీవితం ఎంతో సాఫీగా సాగిపోతున్నప్పటికీ వ్యక్తిగత జీవితం మాత్రం అనుకున్నంత హాయిగా లేదని తెలుస్తుంది.ఇక ప్రేమలో విఫలమైన ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ పెద్ద ఎత్తున తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించిన రెజినా తన పెళ్లి గురించి ప్రేమ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.2020 వ సంవత్సరంలోనే తన ప్రేమ శకం ముగిసింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Telugu Era Love, Kandanal Sarlum, Love, Regina, Regina Breakup, Tollywood, Web-M

ఇలా తన బ్రేకప్ గురించి చెబుతూనే పెళ్లి గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.బ్రేకప్ కావడంతో ఆ బాధ నుంచి బయటపడటం కోసం తనకు కాస్త సమయం పట్టిందని అయితే ప్రస్తుతం తాను సింగిల్ గా ఉన్నానని తన జీవితంలో ప్రేమ పెళ్లి వంటి విషయాలపై మాట్లాడటానికి తనకు ఏమాత్రం ఇష్టం లేదని తెలిపారు.తన జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదో తనకే తెలియదంటూ ఈ సందర్భంగా పెళ్లి గురించి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube