విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి పెరుగుతోంది.గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు పులిచింతల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది.
దీంతో బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు.అనంతరం ప్రాజెక్ట్ 70 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
కాగా, ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో ముంపు ప్రభావిత ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అదేవిధంగా కృష్ణా నది పరీవాహక ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.







