ఏపీ సీఎం జగన్ ఈనెల 22న కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.దీనిలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ స్థలాలను చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్ లు పరిశీలించారు.ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం జగన్ పర్యటించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.రానున్న ఎన్నికల్లో కుప్పం స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలని వైసీపీ భావిస్తుందని తెలుస్తోంది.







