చాలాకాలంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు గవర్నర్ తమిళ సై సౌందర్యరాజన్ కు మధ్య పరోక్ష వార్ నడుస్తోంది.అధికారిక కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ ను పిలవాల్సి ఉన్నా, కేసీఆర్ పట్టించుకోకపోవడం, అలాగే గవర్నర్ కార్యాలయం రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమాలకు హాజరు కావలసిందిగా తెలంగాణ సీఎం హోదాలో కేసిఆర్ కు ఆహ్వానాలు అందిస్తున్నా, కేసీఆర్ మాత్రం రాజ్ భవన్ కు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు.
ఈ తరహా వ్యవహారాలపై కొద్ది నెలల క్రితమే ఢిల్లీలో గవర్నర్ తమిళసై మీడియా సమావేశం నిర్వహించి మరి, కేసీఆర్ పై విమర్శలు చేశారు.
తాజాగా మరోసారి ఆ తరహా విమర్శలే ఆమె చేయడంతో ప్రగతిభవన్ , రాజ్ భవన్ కు మధ్య దూరం మరింత పెరిగిందనే విషయం బయటపడింది.
గవర్నర్ పదవి చేపట్టి మూడేళ్లు అవుతున్న సందర్భంగా తమిళ సౌందర్యరాజన్ ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు .ఆ సందర్భంగా గవర్నర్ తన ఆవేదనను వెలగక్కారు. ప్రభుత్వం తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని, హెలికాప్టర్ అడిగినా, తగిన సమాచారం ఇవ్వలేదని ఎట్ హోం కార్యక్రమానికి వస్తానని చెప్పి కేసీఆర్ రాలేదని, కనీసం రావట్లేదు అన్న సమాచారం కూడా ఇవ్వకుండా తనను అవమానించారని ఆమె చెప్పుకొచ్చారు.గవర్నర్ ఆఫీసును చులకనగా చూస్తున్నారని తీవ్రమైన వివక్ష టిఆర్ఎస్ ప్రభుత్వం చూపిస్తుందని ఆమె విమర్శించారు.

రాజ్ భవన్ ఏమైనా అంటరాని స్థలమా అంటూ ప్రశ్నించారు.అసలు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్ భవన్ కు ఎందుకు రావడం లేదని ఆమె ప్రశ్నించారు .ఒక మహిళను అవమానించిన ప్రభుత్వంగా ముద్రపడకూడదని ఆమె అన్నారు.మేడారం, భద్రాచలం పర్యటనకు తాను వెళ్లిన సమయంలో హెలికాప్టర్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినా స్పందించలేదని, చేసేదిలేక తాను ఎనిమిది గంటలపాటు కారులో ప్రయాణించి ఆ ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన చెందారు.
అయితే గవర్నర్ తమిళ్ సై ప్రభుత్వంపై వేధింపులకు పాల్పడడం లేదు.వివిధ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని బీజేపీ గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.
కానీ తమిళసై ఆ తరహా వేధింపులకు పాల్పడకపోయినా, కేసిఆర్ మాత్రం ముందస్తు జాగ్రత్తతోనే వ్యవహరిస్తున్నారు.కానీ ప్రోటోకాల్ ఇస్తే ఎటువంటి అసంతృప్తికి గురవ్వరు.ఆమె కోరుకునేది కూడా ప్రోటోకాల్ మాత్రమే.తనకు సరైన గౌరవ మర్యాదలు ఇస్తూ ప్రోటోకాల్ పాటిస్తే చాలు అన్నట్లుగా తమిళ సై వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతుంది.
కానీ ఈ విషయంపై కేసీఆర్ పునరాలోచించుకోవాల్సిందే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.







