తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ పేర్కొంది.
గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం అస్తవ్యస్థమైంది.లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
పలు చోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు అధికారులు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.