బాలాపూర్ గణనాథని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.ఎమ్మెల్సీ కవిత వెంట మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు పట్టొళ్ల కార్తీక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.
వినాయకుని దయ వల్ల ప్రజలు అందరూ సుఖ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.బాలాపూర్ వినాయకుని లడ్డు చాల ధరకు పలుకుతుందని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కవిత అన్నారు.
వినాయకుని దయవల్ల రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నిరంతరాయంగా జరగాలని ఆకాంక్షించారు.అనేకమంది అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని రాష్ట్రానికి ఆదాయం రాకుండా చేయాలని,ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని ఆపాలని రాష్ట్రంలో ఒడిదుడుకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కవిత అన్నారు.
భారతదేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు కవిత తెలిపారు.







