సాధారణంగా బ్యాంకులు అనేవి ఎప్పటికప్పుడు కొత్త కొత్త క్రెడిట్ కార్డులు మార్కెట్లోకి తెచ్చి తన కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంటాయి.దాంతో నేడు క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది.
బ్యాంకులు రకరకాల ఆఫర్లు అందిస్తూ కార్డులను జారీ చేయడం కూడా దానికి ఓ కారణం.ఇక తాజాగా SBI నుంచి కొత్త క్రెడిట్ కార్డు అందుబాటులోకి వచ్చింది.
ఇక ఈ క్రెడిట్ కార్డుతో నిర్వహించే అన్ని ఆన్లైన్ లావాదేవీలపై 5% వరకు నగదు వెనక్కి ఇచ్చేలా SBI కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ క్యాష్‌బ్యాక్ SBI కార్డును ఆవిష్కరించింది.
క్యాష్‌బ్యాక్ SBI కార్డును వాడినప్పుడు సాధారణ లావాదేవీలపై 1% నగదు వెనక్కి వస్తుంది.
అదే సమయంలో ఆన్లైన్ వ్యవహారాల్లో కూడా 5% వరకు నగదును క్యాష్‌బ్యాక్ ఆఫర్‌గా అందిస్తోంది.ఒక బిల్లింగ్ నెలలో గరిష్టంగా రూ.10 వేల వరకు కొనుగోలుకే ఈ నగదు వెనక్కి వచ్చే సదుపాయం ఉందనేది కస్టమర్లు ఇక్కడ గుర్తించుకోవాలి.కార్డు లావాదేవీలకు సంబంధించి స్టేట్మెంట్ వచ్చిన రెండు రోజుల్లో క్యాష్‌బ్యాక్ కార్డు ఖాతాల్లో జమ అయ్యేది.
మిగితా బిల్లు చెల్లించాల్సి వచ్చేది.దీంతో పాటు పెట్రోల్, డీజిల్‌లపై గరిష్టంగా రూ.100వరకు సర్ఛార్జీని రద్దు చేస్తుంది.
ఈ క్రెడిట్ కార్డు వార్షిక రుసుము రూ.999 చెల్లించాల్సి ఉంటుంది.సంవత్సరంలో రూ.2 లక్షల వరకు బిల్లింగ్ చేసినప్పుడు ఈ ఫీజును వెనక్కి ఇచ్చేస్తుంది.మార్చి వరకు కార్డును తీసుకున్న వారికి మొదటి ఏడాది సభ్యత్వ రుసుము ఉండదని SBI కార్డు తెలిపింది.
ఇలా ఈ కార్డును తీసుకున్న వారు మంచి లాభాలు పొందవచ్చు.కార్డులను సరిగ్గా వినియోగించుకుంటూ సమయానికి బిల్లులు చెల్లించినట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కూడా.అందుకనే ఒకసారి ట్రై చేయండి.