టీఆర్ఎస్ ప్రభుత్వానికి కావాల్సింది దారుసలాంలో సంబురాలు అని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు.హైదరాబాద్ ట్యాంక్ బండ్ కు వెళ్లిన ఆయన.
వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.ఈ క్రమంలో ఏర్పాట్లపై ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
హిందూ పండుగలపై సర్కార్ వివక్ష చూపిస్తోందని విమర్శించారు.
వినాయక ఉత్సవాలపై లేనిపోని నిబంధనలు పెట్టారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూవుల పండుగలను ప్రభుత్వం చులకనగా చూస్తుందని విమర్శించారు.ఓ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకే ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు.







