టీఆర్ఎస్ కు కావాల్సింది దారుసలాంలో సంబురాలుః బండి సంజయ్
TeluguStop.com
టీఆర్ఎస్ ప్రభుత్వానికి కావాల్సింది దారుసలాంలో సంబురాలు అని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ కు వెళ్లిన ఆయన.వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ క్రమంలో ఏర్పాట్లపై ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.హిందూ పండుగలపై సర్కార్ వివక్ష చూపిస్తోందని విమర్శించారు.
వినాయక ఉత్సవాలపై లేనిపోని నిబంధనలు పెట్టారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూవుల పండుగలను ప్రభుత్వం చులకనగా చూస్తుందని విమర్శించారు.ఓ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకే ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు.