విడుదలకు వారం ముందు హడావిడితో ఏమైనా వర్కౌట్ అయ్యేనా?

సినిమా ఎంత బాగా తీసిన కూడా దాన్ని ప్రేక్షకులకు తీసుకు వెళ్లే విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే తప్పకుండా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుచుతుంది అంటూ గతంలో విడుదలైన పలు సినిమాలు నిరూపించాయి.అందుకే సినిమాల విడుదల విషయంలో నిర్మాతలు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు.

 Saakini Daakini Movie Ready For Release But No Promotions , Saakini Daakini , N-TeluguStop.com

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి.ఇక సినిమాకు మంచి రిలీజ్ డేట్ ఎంత ముఖ్యమో… ప్రమోషన్ కార్యక్రమాలు అంతకంటే ముఖ్యం అనడంలో సందేహం లేదు.

తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్యకాలంలో విడుదలైన చాలా సినిమాలు భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలతో విడుదల అయ్యాయి.ఆ కార్యక్రమాలు లక్షల ఖర్చు చేసి మరీ నిర్వహించారు.

మూడు నాలుగు వారాల పాటు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత మాత్రమే విడుదల జరుగుతుంది.కానీ సురేష్ బాబు సమర్పణలో తెరకెక్కిన షాకిని డాకిని సినిమా కేవలం వారం రోజుల ముందు ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి.

వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాకి తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు.

ఈ సినిమా పూర్తి అయ్యి చాలా నెలలు అవుతుంది.

ప్రారంభమై రెండు మూడు సంవత్సరాలు అవుతున్నట్లుగా తెలుస్తోంది.జనాలు ఈ సినిమా గురించి పూర్తిగా మర్చిపోయారు.

మీడియా వారు కూడా ఈ సినిమా గురించి పెద్దగా పట్టించుకోలేదు.నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే వరకు కూడా మీడియా గుర్తు పెట్టుకోలేదు.

అలాంటిది ఈ సినిమాని ఏ రేంజ్ లో ప్రమోషన్ చేయాలో మీకు తెలిసే ఉంటుంది.కానీ వీరు మాత్రం పెద్దగా ప్రమోషన్ చేయకుండా నార్మల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

పెద్దగా అంచనాలు లేకుంటే సినిమా విడుదల అయితే మినిమం టాక్‌ దక్కించుకున్నా కూడా ఎక్కువ వసూలు సొంతం చేసుకుంటుంది అని భావిస్తున్నారేమో.కానీ కనీసం ప్రమోషన్ చేయకుండా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే ఎవరు చూస్తారు అనేది కొందరి అభిప్రాయం.

ఈ సినిమాలో రెజీనా మరియు నివేద థామస్ లు హీరోయిన్స్ గా నటించారు.కొరియన్ సినిమా కు ఇది రీమేక్ అంటూ వార్తలు వస్తున్నాయి.

ఆ విషయమై యూనిట్ సభ్యులు అనధికారికంగా క్లారిటీ ఇస్తున్నారు.ఈ సినిమాకు ఎలాంటి ఫలితం దక్కుతుంది.

ప్రమోషన్ కార్యక్రమాలు తక్కువ చేయడంతో ఎలాంటి ఫలితం ఈ సినిమా ఫేస్ చేయబోతుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube