వైరల్: పోలీసు వృత్తికే అవమానం... హోంగార్డుని నడిరోడ్డుపై చితక్కొట్టిన కానిస్టేబుల్!

ఈ దృశ్యం పోలీసు వృత్తికే అవమానం.అవును.

 Homeguard And Police Fight On Road , Police , Home Guard , Constable , Viral Vid-TeluguStop.com

ప్రజలు తప్పు చేస్తే, బుద్ది చెప్పాల్సిన పోలీసులు పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా విచక్షణా రహితంగా చితకొట్టుకున్నారు.ఇక ఈ తంతుని డైరెక్ట్ గా చుసిన స్థానికులు ‘అసలు వీళ్లు పోలీసులా, రౌడీలా?’ అంటూ నవ్వుకుంటున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది.ఇక ఆ పోలీసులు కొట్టుకోవడం వెనుక గల కారణాలను తెలుసుకోవాలంటే ఇది పూర్తిగా చదవండి.

ఈ దురదృష్టకర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జలాన్‌లోని జగమ్మన్‌పూర్‌ పోలీస్ స్టేషన్‌ సమీపంలో జరిగింది.ఓ హోంగార్డు, కానిస్టేబుల్‌ నడిరోడ్డుపై పోరుకి సిద్ధం అయ్యారు.

కారణం తెలిస్తే అవాక్కవుతారు… అవును, ఓ మద్యం విషయంలో జరిగిన గొడవే దీనికి గల కారణమని తెలుస్తోంది.తొలుత ఇద్దరి మధ్య ప్రారంభమైన, వాగ్వివాదం కాస్తా ముదిరి కొట్లాటకు వరకు దారి తీసింది.

దీంతో చెలరేగిపోయిన కానిస్టేబుల్.హోంగార్డుపై ముష్టిఘాతాలు కురిపించాడు.

కాళ్లతో తంతూ, పిడిగుద్దులు గుద్దుతూ చెలరేగిపోయాడు.అయితే ఈ వీడియోలో సదరు హోమ్ గార్డు మాత్రం పెద్దగా ప్రతిఘటించినట్టు కనబడటం లేదు.

అలా వారు కొట్లాడుతూ… కొట్లాడుతూ… ఇద్దరూ రోడ్డు పక్కనే ఉన్న పొదల్లో పడటం మనం చూడవచ్చును.కిందపడ్డాక హోంగార్డుపై కానిస్టేబుల్ మరింతగా చెలరేగిపోయాడు.ఆగకుండా పిడిగుద్దులు కురిపించాడు.మరో కానిస్టేబుల్ వారిని విడిపించేందుకు ప్రయత్నించినా ఇక్కడ ఫలితం లేకుండా పోయింది.దాదాపు గంటపాటు వారి మధ్య జరిగిన కోట్లాట కాస్త ఎవరో ఒక స్థానికుడు వీడియో తీయడంతో వెలుగు చూసింది.పట్టపగలు నడిరోడ్డుపై వీరిద్దరూ కొట్లాడుకుంటుంటే దారినపోయే వారు వాహనాలు ఆపి మరీ చూస్తుండిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube