టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.అయితే వచ్చే ఎన్నికలలో గెలవడమే ధ్యేయంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ అదే దిశగా దూసుకుపోతున్నారు.
ఇందుకోసం కమిట్ అయిన సినిమాలను పక్కన పెట్టి మరి రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు.అయితే పవన్ కళ్యాణ్ ఆశలు నెరవేరాలని కోరుకుంటున్నట్లు టాలీవుడ్ ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.పవన్ కళ్యాణ్ కెరియర్ లో 27 సినిమాల వరకు చేసి ఉంటాడు.
ఒక సమయంలో పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా దూసుకెళ్లాడు.
అత్తారింటికి దారేది ఇలాంటి సినిమాలతో జనాలను అయోమయం చేశాడు.
ఇప్పుడు మళ్లీ డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు.అయితే సినిమా వేరు రాజకీయం వేరు.
తమిళనాడు,కర్ణాటక,ఏపీ తెలంగాణలో చిన్నవాళ్లు రాజకీయాలలోకి ఎంతోమంది వచ్చిన విషయం మనకు తెలిసిన సంగతి.ఒక పార్టీకి సపోర్ట్ గా నిలబడదాం ఒకసారి పార్లమెంటుకు వెళ్లి వద్దాం అనుకోవడం వేరు.
అలాగే సమాజాన్ని తన దృక్పథంతో మార్చాలి అన్న ఆశయం ఉండడం లేదు.పవన్ కళ్యాణ్ గారికి ఆశ ఉంది.
ఇలానే గతంలో ఎన్టీఆర్ కూడా తన ఆశయంతో పార్టీని స్థాపించడం జరిగింది.ఇక మన ఆలోచన మాదిరిగానే బలమైన ప్రతిపక్షం ఉండాలని.

అలాగే మన వాక్కు సభల ద్వారా ప్రజలకు తెలియజేయాలి అన్న ఆలోచన పవన్ కళ్యాణ్ ది అని చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ.ఎవరు కలిసి వచ్చిన రాకపోయినా తన పోరాటం తాను చేసుకుంటూ పోయే వీరుడు పవన్ కళ్యాణ్.అయితే ఎవరు, ఏ పార్టీ అధికారంలోకి రావాలి అన్న విషయాన్ని నేను మాట్లాడను కానీ పవన్ కళ్యాణ్ గారి వాయిస్ చట్టసభల ద్వారా వినబడాలని కోరుకునే వ్యక్తులలో నేను కూడా ఒకరిని అని చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ.ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే హక్కు వచ్చే ఎన్నికలలో ఆయన పొందాలి అని నేను కోరుకుంటున్నాను అని తెలిపారు.
అది ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి వంటి మంచి మంచి సినిమాలు చేశారు.ఇటువంటి సినిమాలలో ఒక మంచి అద్భుతమైన సినిమాని పవన్ కళ్యాణ్ ఎంచుకొని ఆ సినిమా ప్రజల్లోకి వెళ్ళే విధంగా చేయగలగాలి.
అప్పుడే పవన్ కళ్యాణ్ అనుకున్న విధంగా సక్సెస్ సాధించగలరు అని చెప్పుకొచ్చారు గోపాలకృష్ణ.







