దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చి కేంద్రంలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ కు గట్టిపట్టు ఉన్న ఒక్కో రాష్ట్రం వరుసగా చేజారి పోతూ ఉండడం, దేశవ్యాప్తంగా బిజెపి ప్రభావం పెరుగుతూ కాంగ్రెస్ దుర్బర పరిస్థితిని ఎదుర్కోవడం వంటి వ్యవహారాలపై రాహుల్ సీరియస్ గానే దృష్టి పెట్టారు.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టాలని రాహుల్ నిర్ణయించుకున్నారు.ఈ మేరకు’ భారత్ జోడో యాత్ర ‘ పేరుతో నేటి నుంచి తమిళనాడులోని కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ వరకు పాదయాత్ర చేయనున్నారు.
ఈ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను నేరుగా కలవడంతో పాటు, వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవడం, కాంగ్రెస్ ను ఆదరించాలని ప్రజలను కోరడం వంటి వి చేపట్టనున్నారు.దేశంలో బిజెపియేతర శక్తి బలంగా ఉందని చాటి చెప్పాలని పకడ్బందీగా పాదయాత్రను రాహుల్ ఎంచుకున్నారు.
ఈ పాదయాత్ర చేపట్టేందుకు వీలుగా నిన్న రాత్రి రాహుల్ చెన్నైకి చేరుకున్నారు. ఈరోజు ఉదయం శ్రీ పెరంబదూరులోని తన తండ్రి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారక గాంధీ రాహుల్ సందర్శిస్తారు.
అనంతరం అక్కడి నుంచి తిరువనంతపురం మీదుగా కన్యాకుమారి చేరుకుంటారు.స్వామి వివేకానంద, తిరువళువర్ విగ్రహాలు మాజీ ముఖ్యమంత్రి కామరాజు స్మారక స్థూపాన్ని రాహుల్ సందర్శిస్తారు.ఆ తరువాత మహాత్మా గాంధీ మండపం వద్ద తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జాతీయ జెండాను రాహుల్ గాంధీకి అందించి యాత్రను ప్రారంభించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, చత్తీస్గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగోల్ సైతం పాల్గొంటారు.అనంతరం జరిగే బహిరంగ సభలో రాహుల్ ప్రసంగం చేస్తారు.బుధవారం లాంఛనంగా ప్రారంభించి గురువారం 7 గంటల నుంచి పాదయాత్ర మొదలుపెట్టనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి .తమిళనాడులో నాలుగు రోజులు పాటు ఈ యాత్ర కొనసాగింది.దీనికి భారీగానే భద్రత ఏర్పాట్లు చేశారు.
రాహుల్ పాదయాత్ర కు నిత్యం మూడు షిఫ్టుల్లో పోలీసు బలగాలు భద్రత కల్పించనున్నాయి.తమిళనాడులో 2500 మంది పోలీసులను ఈ విధుల్లో నియమించారు.
ఈ యాత్ర 11వ తేదీన కేరళలోకి ప్రవేశిస్తుంది.ఈ యాత్ర సందర్భంగా ఎటువంటి హంగామా , భారీ ఏర్పాట్లు చేయకుండా సాదాసీదాగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
రాహుల్ గాంధీ పాదయాత్రలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 117 మంది కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు.వీరిని భారత్ యాత్రీస్ అని పిలుస్తున్నారు.
ఈ యాత్రలో ఏపీ నుంచి సుంకర పద్మశ్రీ, తెలంగాణ నుంచి ఆరుగురు నాయకులు పాల్గొంటున్నారు.








