ఆద్యాంతం ఉత్ఖంట బరితంగా సాగిన బ్రిటన్ ఎన్నికల్లో ఎట్టకేలకు బ్రిటన్ పౌరురాలు లిజ్ ట్రస్ ప్రధానిగా గెలుపొందారు.భారత సంతతి వ్యక్తిగా రిషి సునక్ ఓడిపోయారు.
అయితే రిషి సునక్ గెలుపు నల్లేరు మీద నడకేనని ముందుగా భావించినా ఊహించని విధంగా లిజ్ ట్రస్ కి మద్దతు పెరిగిపోవడంతో రిషి గెలుపుపై సందేహాలు వ్యక్తం అవుతూ వచ్చాయి.ఊహించిన విధంగానే లిజ్ ట్రస్ గెలుపొందారు.
గెలుస్తాడని భావించిన రిషి సునక్ ఓటమికి కారణాలు ఏంటి అనే కోణంలో పరిశీలకులు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.ముందు నుంచీ వేగంగా అందరిని దాటుకుంటూ వచ్చిన రిషి ఒక్క సారిగా చివరి పోరులో ఓడిపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయని అవన్నీ ఒకెత్తయితే ప్రధాన కారణం మాత్రం వెన్నుపోటు కారణంగానే రిషి ఓడిపోయారని అంటున్నారు.
బ్రిటన్ మీడియా వెల్లడించిన కధనాల ప్రకారం.రిషి సునక్ కు రాజకేయ గురువు మాజీ ప్రధాని బోరిస్.తనకు రాజకీయ బిక్ష పెట్టిన వ్యక్తి కష్టాలలో ఉన్న సమయంలో రిషి వెన్ను పోటు పొడిచి మరీ ఆయన పదవీ చ్యుతుడు అవ్వడానికి కారణం అయ్యారనేది ప్రధానంగా బ్రిటన్ మీడియాలో అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్త.ఆర్ధిక మంత్రగా రిషి రాజీనామా చేయడంతో ఆయన బాటలో మరో 50 మంది రాజీనామాలు చేయడంతో బోరిస్ దిగిపోక తప్పలేదు.
బోరిస్ కి జరిగిన అన్యాయాన్ని బ్రిటన్ వాసులు కూడా జీర్ణించుకోలేక పోయారు.
ఇక రిషి సునక్ భార్య అక్షితా మూర్తి చుట్టూ వివాదాలు ఉండటం, ఆమె బ్రిటన్ రాణి కంటే కూడా ధనవంతురాలు అని ప్రచారం అవడం, కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొట్టి రిషి పలుకుబడిని ఉపయోగించుకున్నారనే ప్రచారం జరగడం కూడా రిషి కి మైనస్ అయ్యింది.
ఇక అమెరికా రిషి కి ఇచ్చిన గ్రీన్ కార్డ్ ను రిషి వెనక్కి ఇవ్వలేదని బ్రిటన్ ద్వంద్వ పౌరసత్వాన్ని అంగీకరించినా భాద్యతాయుతమైన వ్యక్తిగా రిషి గ్రీన్ కార్డ్ అమెరికాకు ఇచ్చేయలేదని.భవిష్యత్తులో బ్రిటన్ వీడి అమెరికా వేల్లిపోతారనే ప్రచారం జరగడం కూడా రిషికి ఎదురు దెబ్బ తగిలేలా చేసింది.
ఇక తన విలాసవంతమైన జీవితం కూడా రిషి సునక్ కి అతి పెద్ద మైనస్ అయ్యిందనే చెప్పాలి.ఎన్నికల ప్రచారంలో ఒక పక్క రిషి సునక్ నేను మీలో ఒకడిని, డబ్బు ఉన్నా సామాన్యుడిని అంటుంటే మరో పక్క సోషల్ మీడియాలో నేను డబ్బున్న వాడిని, నా సన్నిహితులు అందరూ డబ్బు ఉన్నవాళ్ళేనని రిషి గతంలో చెప్పిన వీడియో వైరల్ అయ్యి రిషి ఓటమికి తన వంతు పాత్ర పోషించేలా చేసింది.
వెరసి తన ఓటమికి ఎన్ని రీజన్స్ ఉన్నా సరే బోరిస్ కి పొడిచిన వెన్నుపోటు రిషి గెలుపుకి చేటు తెచ్చిందనేది ప్రధాన రీజన్ అంటున్నారు పరిశీలకులు.
.






