భూమా మౌనిక పెళ్లికి అతిథిగా హాజరైన మనోజ్.. మౌనికాకు ఇది మొదటి పెళ్లి కాదా?

గత రెండు రోజుల నుంచి మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.మంచు మనోజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు కుమార్తె భూమా మౌనిక రెడ్డితో రెండవ వివాహం జరగబోతుంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.

 Manoj Attended Bhuma Maunikas Wedding As A Guest Is This Maunikas First Marriage-TeluguStop.com

ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి పలు పూజా కార్యక్రమాలలో పాల్గొనడంతో ఇది నిజమేనని కొందరు భావిస్తున్నారు.ఈ విధంగా మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో భూమా మౌనిక గురించి కొందరు ఆరాతీస్తున్నారు.

భూమా మౌనిక కర్నూలు జిల్లాలో రాజకీయాలలో ఎంతో కీలకపాత్ర పోషించినటువంటి భూమా నాగిరెడ్డి శోభ నాగిరెడ్డి రెండవ కుమార్తె.భూమ నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి ఇద్దరు మృతి చెందడంతో రాజకీయాలలోకి వారి పెద్ద కుమార్తె అఖిల ప్రియ ఎంట్రీ ఇచ్చారు.

ఇకపోతే భూమా మౌనిక ప్రస్తుతం మంచు మనోజ్ ను పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి.అయితే భూమ మౌనికకు ఇది మొదటి వివాహం కాదు.ఈమెకు ఇదివరకే పెళ్లి జరిగిన విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.2015లో భూమా మౌనిక వివాహం ఎంతో ఘనంగా జరిగింది.

Telugu Akhila Priya, Andhra Pradesh, Bhuma Maunika, Bhuma Nagi, Kurnool, Manoj A

ఈ విధంగా 2015లో వివాహం చేసుకున్న భూమా మౌనిక కొన్ని కారణాలవల్ల తన భర్తతో విడిపోయి విడాకులు తీసుకున్నారు.ఈ విధంగా భర్త నుంచి విడిపోయిన మౌనిక మంచు మనోజ్ ను రెండవ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది.మరొక విడ్డూరం ఏంటంటే భూమా మౌనిక మొదటి పెళ్లికి మంచు మనోజ్ అతిథిగా వెళ్లడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే పెళ్లికి సంబంధించిన వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా అమ్మాయి పెళ్ళికి అతిథిగా వెళ్ళిన మంచు మనోజ్ చివరికి ఆ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారింది.ఇద్దరికీ రెండవ వివాహం కనుక వీరి వైవాహిక జీవితంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు.

మొత్తానికి మంచు మనోజ్ మౌనిక పెళ్లికి అతిథిగా వెళ్లి చివరికి తనని పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube