నెల్లూరు జిల్లాలో సంగం, పెన్నా బ్యారేజీలను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించడం జరిగింది.ఆత్మకూరు నియోజకవర్గం లో మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ, పెన్నా బ్యారేజీలను ప్రారంభించారు.

 Ap Cm Jagan Inaugurated Sangam And Penna Barrages In Nellore District ,ap Cm Jag-TeluguStop.com

ఇదే పర్యటనలో దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు.

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ… ఇంకా నెల్లూరు జిల్లాలో కరువు మండలమే ఉండదని పేర్కొన్నారు.ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు.

గతంలో చెప్పినట్టుగానే సంగం మ్యారేజికి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెట్టినట్లు స్పష్టం చేశారు.దీంతో ఆయన మన మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పుకొచ్చారు.నెల్లూరు బ్యారేజీ నిర్మాణం కోసం 300 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు.ఈ క్రమంలో తన తండ్రి వైఎస్ఆర్ ప్రారంభించిన ప్రాజెక్టును తాను పూర్తి చేయటం చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ చేయలేనిది తమ ప్రభుత్వం చేసి చూపించింది అని సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు హయాంలో ముహూర్తాలు మార్చుకుంటూ పోయారే గాని.

ప్రాజెక్టును పూర్తి చేయలేదని చెప్పుకొచ్చారు.తేదీలు మార్చి.

రేట్లు పెంచి కమిషన్లు దండుకున్నారని.ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నేతలతో పాటు మేకపాటి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube