బిగ్ బాస్ సీజన్ 6 లో కామన్ మెన్ గా వెళ్లాడు ఆది రెడ్డి.బిగ్ బాస్ రివ్యూస్ చెబుతూ ఆ బిగ్ బాస్ లో కంటెస్టంట్ గా వెళ్లడం కన్నా గొప్ప అచీవ్ మెంట్ మరేముంటుంది చెప్పండి.
ఇక అన్ని సీజన్లని వడ పట్టిన ఆది రెడ్డి ఈ సీజన్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ముందుకు వెళ్తాడని చెప్పొచ్చు.అంతేకాదు బిగ్ బాస్ ఆటని బాగా అర్ధం చేసుకున్న అతను ఆటని పర్ఫెక్ట్ గా ఆడుతాడని చెప్పొచ్చు.
ఆల్రెడీ సోమవారం ఎపిసోడ్ లో ఒక టాస్క్ లో తన సత్తా చాటాడు ఆది రెడ్డి.
యూట్యూబర్ గా బిగ్ బాస్ రివ్యూస్ ద్వారానే క్రేజ్ తెచ్చుకున్న ఆదిరెడ్డిని ఎంత ఇచ్చి హౌజ్ లోకి తీసుకున్నారు అన్న డిస్కషన్స్ రాకమానదు.
ఓ విధంగా చెప్పాలంటే బిగ్ బాస్ రివ్యూస్ ద్వారానే ఆది రెడ్డి బాగా సంపాదిస్తాడని చెప్పొచ్చు.అయితే హౌజ్ లోకి వెళ్లడమే ఓ పెద్ద గిఫ్ట్ అనుకున్న ఆది రెడ్డి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చినా ఓకే అని చెప్పాడట.బిగ్ బాస్ టీం ఆది రెడ్డికి వారానికి 2.5 లక్షల చూపున డీల్ కుదుర్చుకున్నారట.బిగ్ బాస్ రివ్యూస్ ద్వారా 3 లక్షల దాకా ఫాలోవర్స్ ఏర్పరచుకున్న ఆది రెడ్డి ఈజీగా ఫైనల్స్ వరకు చేరొచ్చని కొందరి టాక్.అయితే అది తన ఆట తీరుని బట్టి ఉంటుంది.







